ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య కి విడాకులిచ్చిన సమంత సోషల్ మీడియాలో నెటిజెన్స్ తోను, యూట్యూబ్ ఛానల్స్ తోనూ పెద్ద పోరాటమే చేసింది. మానసికంగా బాధపడుతూనే తనని కించపరిచిన వారిని ధైర్యంగా ఎదుర్కొంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే సమంత తాజాగా షేర్ చేసిన ఓ పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ఎలాంటి సమస్యలనైనా, పరిస్థితులనైనా తట్టుకుని నిలబడేలా ఆడపిల్లని పెంచాలని, మా అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారని బాధపడకుండా.. ఆమెని శక్తివంతంగా.. పరిస్థితులపై పోరాడే విధంగా పెంచండి. అమ్మాయి పెళ్లి కోసం డబ్బు దాచిపెట్టడానికి బదులు.. ఆ డబ్బుని ఆమె చదువుపై ఖర్చుపెట్టండి.
మరీ ముఖ్యంగా అమ్మాయిని పెళ్లికి సిద్ధపడేలా చేయడానికి బదులు, ముందు తన కాళ్లపై తాను నిలబడగలిగేలా చేయండి. ఆత్మస్తైర్యంతో.. ముందుకు నడిచేలా, నడిపించేలా.. జీవితాల్లో ఎలాంటి ఒడిడుకులు వచ్చినా తట్టుకుని నిలబడేలా తయారు చెయ్యండి.. అంటూ ఇండియా మహిళా హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్ చేసిన పోస్ట్ ని సమంత సోషల్ మీడియా లో షేర్ చేసింది. ప్రస్తుతం సమంత ఉన్న పరిస్థితికి ఆ పోస్ట్ కి ఎంతో దగ్గర సంబంధం ఉంది. కాబట్టే సమంత సోషల్ మీడియాలో ఆ పోస్ట్ ని షేర్ చేసింది.