రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంటే.. ఆర్.ఆర్.ఆర్ హీరోలు రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ మాత్రం తమ తదుపరి ప్రాజెక్ట్స్ లో జాయిన్ అవ్వబోతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ RC15 షూటింగ్ కి హాజరవుతుంటే.. ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో ని ముగించేశాడు. అలాగే కొరటాలతో NTR30 కోసం రెడీ అవుతున్నాడు. ఇక రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ ప్రమోషనల్ ఈవెంట్స్ పై ఫోకస్ చేసారు. ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ ప్రమోషన్స్ ఓ రేంజ్ లో ఉండాలి అని, ఈ రెండు నెలలు ఆర్.ఆర్.ఆర్ గురించే మాట్లాడుకునేలా రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారట. నాలుగైదు సిటీస్ లో ఆర్.ఆర్.ఆర్ ఈవెంట్స్ నిర్వహించాలని.. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం కూడా వేదిక సెట్ చేసినట్లుగా సోషల్ మీడియా టాక్.
అది దుబాయ్ వేదికగా ఆర్.ఆర్.ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీ ఎత్తున నిర్వహించే ఏర్పాట్లు జరుగుతూన్నాయని, ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, ఓవిలియా, శ్రియ, అజయ్ దేవగన్, ఇంకా సినిమాలో కీలకమైన నటులు, టెక్నీకల్ సిబ్బంది హాజరయ్యేలా డేట్ రెడీ చేస్తున్నారట రాజమౌళి. గతంలో రోబో 2 ఆడియో వేడుక దుబాయ్ లో జరిగింది. ఈసారి ఆర్.ఆర్.ఆర్ ఈవెంట్ అక్కడ జరిపితే సినిమాకి మంచి హైప్ క్రియేట్ అవుతుంది అని.. రాజమౌళి ప్లాన్. సో చెన్నై, ముంబై, హైదరాబాద్.. ఇంకా కొన్ని ముఖ్యమైన సిటీస్ లో ఆర్.ఆర్.ఆర్ ఈవెంట్స్ నిహించేందుకు రాజమౌళి పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి.. రంగంలోకి దిగుతారని.. అది కూడా ఈ నెల 29 నుండే అంటున్నారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ పై అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.