Advertisementt

కోర్టు తీర్పు: సమంత కి ఊరట.. కానీ..

Tue 26th Oct 2021 09:33 PM
samantha,court verdict,samantha vs youtube channels,kukatpally court  కోర్టు తీర్పు: సమంత కి ఊరట.. కానీ..
Court delivers verdict over Samantha plea కోర్టు తీర్పు: సమంత కి ఊరట.. కానీ..
Advertisement
Ads by CJ

నాగ చైతన్య తో డివోర్స్ తీసుకున్న సమంత. ఆ విషయాన్నీ సామజిక మాధ్యమాల ద్వారా అందరికి షేర్ చేసింది. ఆ తర్వాత సమంత గురించి పలు యూట్యూబ్ ఛానల్స్ డిబేట్స్ అవి పెట్టి.. ఆమెని కించపరిచే విధంగా మాట్లాడారంటూ.. తన వ్యక్తిగత విషయాలను మాట్లాడినందుకు గాను.. తనని మానసికంగా బాధ పెట్టినందుకు గాను సమంత యూట్యూబ్ ఛానల్స్ పై పరువు నష్టం కేసు పెట్టింది. సమంత కేసు కూకట్ పల్లి కోర్టు విచారణలో ఉండగా.. సమంత తరుపు న్యాయవాది సమంత సెలెబ్రిటీ అయినందు వలన ఆమె షూటింగ్స్ కి హారవుతుంది కాబట్టి ఆమె కేసు త్వరగా విచారించమని కోర్టుని అడగగా.. కోర్టులో సెలెబ్రిటీస్ అయినా, సామాన్యులైనా ఒక్కటే అని అక్షింతలు వేసింది.

ఇక నేడు మంగళ వారం కూకట్ పల్లి కోర్టులో సమంత కేసు విచారణకి రాగా.. ఈ కేసులో సమంత కి ఊరట లభించింది. సమంత పర్సనల్ లైఫ్ వివరాలు ఎవరూ ప్రసారం చేయకూడదని, అంతేకాకుండా పలు యూట్యూబ్‌ ఛానల్స్‌లో సమంత కి సంబంధించిన వీడియోలు తొలగించాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా సమంత కి కూడా ఓ సలహా ఇచ్చింది కోర్టు. అదేమిటంటే.. సమంత కూడా వ్యక్తిగత వివరాల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయకూడదని సమంతకి సూచించింది. ఇక యూట్యూబ్ ఛానళ్లు, డాక్టర్ వెంకట్ రావుపై పరువు నష్టం దావాలో..  వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అంతేకాకుండా వ్యక్తిగతంగా తనకు క్షమాపణలు చెప్పాలని సమంత కోరింది. కానీ కోర్టు మాత్రం అలాంటి ఆదేశాలు ఇచ్చేందుకు నిరాకరించింది. ఇక రెండు యూట్యూబ్ ఛానల్స్, అలాగే సీఎల్ వెంకట్రావు ప్రసారం చేసిన సమంత వీడియోస్ లింక్స్ ని డిలేట్ చెయ్యాలని మాత్రమే కోర్టు ఆదేశించింది. 

Court delivers verdict over Samantha plea:

Court verdict: A mixed bag for Samantha

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ