Advertisementt

ఆర్యన్ ఖాన్ కి నో బెయిల్..

Tue 26th Oct 2021 08:24 PM
bombay high court,aryan khan,aryan khan bail plea,hearing for tomorrow  ఆర్యన్ ఖాన్ కి నో బెయిల్..
Bombay High Court Adjourns Aryan Khan Bail Plea Till Tomorrow ఆర్యన్ ఖాన్ కి నో బెయిల్..
Advertisement
Ads by CJ

షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విచారణ ఈ రోజు బాంబే హై కోర్టులో జరిగింది. తన కొడుకు ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం షారుఖ్ కష్టాలు మాములుగా లేవు. ఈ రోజు ఎలాగైనా ఆర్యన్ ఖాన్ కి బెయిల్ ఇప్పించాలని షారుఖ్ ఇండియా నెంబర్ వన్ లాయర్ ని రంగం లోకి దింపారు. ఇక బాంబే హై కోర్టులో ఆర్యన్ ఖాన్ కేసు విచారణ జరిపే సమయానికి.. కోర్టు హాలులోకి పెద్ద ఎత్తున జన సమూహం పొగవడంతో.. ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ కి సంబందించిన వాదనలను నిలిపివేశారు. షారుఖ్ ఖాన్ బడా హీరో కావడం, ఈ కేసు అందరి దృష్టిని ఆకర్షించడంతో.. లాయర్లే కాదు.. మీడియా, అలాగే సాధారణ ప్రజలు పెద్ద ఎత్తున కోర్టు హాలులో పొగవడంతో.. విచారణ సమయంలో అంతా గందరగోళంగా మారడంతో ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ ని కోర్టు రేపటికి వాయిదా వేసింది.

దానితో ఈ రోజు ఎలాగైనా బెయిల్ వస్తుంది, కొడుకు ఇంటికి వస్తాడన్న షారుఖ్ దంపతులకి నిరాశే ఎదురైంది. ఇక రేపటి విచారణలో ఆర్యన్ ఖాన్ కి బెయిల్ సంగతి ఏమో కానీ.. ఆర్యన్ ఖాన్ వాట్స్ ఆప్ చాట్ లో ఇప్పటికే హీరోయిన్ అనన్య పాండే పేరు బయటికి రావడంతో ఆమె ఎన్సీబీ విచారణ ఎదుర్కొంటుంది. తాజాగా అనన్య పాండే కాకుండా మరో ముగ్గురు స్టార్ హీరోల పిల్లలతో కూడా డ్రగ్స్ గురించి ఆర్యన్ ఖాన్ చాటింగ్ చేసినట్టు ఎన్సీబీ గుర్తించింది. మరి ఆ సెలబ్రిటీస్ పిల్లలు ఎవరు అని అరా తీసి.. వాళ్ళని కూడా విచారణ చెయ్యాలని, ఈలోపు ఆర్యన్ ఖాన్ కి బెయిల్ వస్తే.. సాక్ష్యాలు తారుమారవుతాయంటూ ఎన్సీబీ కోర్టులో వాదిస్తుంది. 

Bombay High Court Adjourns Aryan Khan Bail Plea Till Tomorrow:

Bombay High Court adjourns Aryan Khan bail plea hearing for tomorrow

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ