షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కి డ్రగ్స్ కేసులో ఇప్పటికే మూడుసార్లు బెయిల్ రిజెక్ట్ అయ్యింది. ఇప్పటివరకు ముంబై కోర్టులో షారుఖ్ కొడుకు తరుపున సతీష్ మాన్‌షిండే, అమిత్ దేశాయ్ తమ వాదనలు వినిపించారు. కానీ వారి వాదనలకు ముంబై కోర్టు ఆర్యన్ ఖాన్ కి బెయిల్ మంజూరు చెయ్యలేదు. అయితే తాజాగా ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం షారుఖ్ ఫ్యామిలీ ముంబై కోర్టును ఆశ్రయించారు. ఈ రోజు మంగళవారం ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ పై బాంబే హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ఆర్యన్ ఖాన్ తరుపున ఇండియా నెంబర్ వన్ లాయరైన ముకుల్ రోహత్గీ తన వాదనలు వినిపించనున్నారు.
ఈ రోజు బెయిల్ పై జరిగే విచారణ షారుఖ్ కుటుంబానికి కీలకంగా మారింది. ఎందుకంటే ఈ రోజు ఆర్యన్ ఖాన్ కి ఒకవేళ బెయిల్ గనక రాకపోతే.. మరో 14 రోజుల పాటు ఆర్యన్ ఖాన్ జైలు ల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నవంబర్ 1 నుండి బాంబే హైకోర్టుకి దీపావళి సెలవలు కావడంతో.. ఇప్పుడు ఆర్యన్ ఖాన్ కి బెయిల్ రావడం కీలకంగా మారింది. అందుకే షారుఖ్ ఖాన్ ఇండియా నెంబర్ వన్ లాయర్ ని రంగంలోకి దించారు. మరి ఈ రోజు కూడా బాంబే హై కోర్టులో ఆర్యన్ ఖాన్ కి బెయిల్ రాకపోతే మళ్లీ 14 రోజుల పాటు ఆర్యన్ ఖాన్ జైల్లో గడపాల్సిన పరిస్థితి.