అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్ వచ్చినా కూడా ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. అందుకే మేకర్స్ కూడా ఎప్పటికప్పుడు సినిమాకు సంబంధించిన విశేషాలను అభిమానుల ముందుంచుతున్నారు. పుష్ప సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇందులో మొదటి భాగం పుష్ప: ది రైజ్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కానుంది. వరుస బ్లాక్‌బస్టర్ చిత్రాలతో పవర్ ప్యాక్డ్ ప్రొడక్షన్ హౌజ్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, మరో నిర్మాణ సంస్ధ ముత్తంశెట్టి మీడియాతో కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో సంచలనం రేపింది.
పుష్ప నుండి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, దాక్కో దాక్కో మేక, రష్మిక మందన శ్రీవల్లి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా సామి సామి అంటూ సాగే మూడో సింగిల్ కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. దీనికి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. తాజాగా ఈ పాటలోని ఓ స్టిల్ బయటికి వచ్చింది. పక్కా మాస్ అవతారంలో అటు అల్లు అర్జున్.. ఇటు రష్మిక మందన్న కనిపిస్తున్నారు. డీ గ్లామర్ గా న్యాచురల్ లుక్స్‌తో కట్టి పడేస్తున్నారు ఈ ఇద్దరూ. అక్టోబర్ 28, ఉదయం 11.07 నిమిషాలకు పూర్తి పాట విడుదల కానుంది. ఈ సినిమాలో విలన్ గా మళయాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు.