ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో కి స్పెషల్ గెస్ట్ గా రామ్ చరణ్ ఓపెనింగ్ ఎపిసోడ్ కి వచ్చాడు. ఆ తర్వాత గెస్ట్ లుగా రాజమౌళి, కొరటాల లు వచ్చారు. ఇక దసరా స్పెషల్ ఎపిసోడ్ కి సమంత వచ్చింది. ఎన్టీఆర్ - సమంత ఎపిసోడ్ ని ప్రేక్షకులు బాగా ఆదరించారు. అయితే సమంత తర్వాత మహేష్ బాబు ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో కి గెస్ట్ గా వచ్చాడంటూ ఓ పిక్ సోషల్ మీడియాలో లీకై హల్చల్ చేసింది. కానీ జెమినీ ఛానల్ వారు ఆ ఎపిసోడ్ డిటైల్స్ ఇవ్వకుండా అందరిని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మరోపక్క ఎవరు మీలో కోటీశ్వరులు షో ఫస్ట్ సీజన్ ని ఎన్టీఆర్ సక్సెస్ ఫుల్ గా ముగించేశాడు. అయితే మహేష్ స్పెషల్ ఎపిసోడ్ ని ఎండింగ్ ఎపిసోడ్ గా ప్రసారం చేయబోతున్నారని అన్నారు.
ఇక సమంత తర్వాత గెస్ట్ లుగా ఈ షో కి మ్యూజిక్ డైరెక్టర్స్ థమన్, దేవిశ్రీ లు వచ్చారు. ఆ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ.. ఎన్టీఆర్ - మహేష్ కాంబో ఎపిసోడ్ మాత్రం దివాళీ స్పెషల్ గా ప్రసారం కాబోతున్నట్టుగా తెలుస్తుంది. మహేష్ బాబు ఎన్టీఆర్ షో లో ఎంటర్టైన్ చెయ్యడమే కాదు..ఈ షో లో ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పి 25 లక్షలు కూడా గెలిచాడనే ప్రచారం ఉంది. మరి దివాళీ కి మహేష్ - ఎన్టీఆర్ కలిస్తే బ్లాస్ట్ జరగడం ఖాయం అని, క్రాకర్స్ కన్నా ఎక్కువగా ఈ ఎపిసోడ్ కి టీఆర్పీ రావడం పక్కా అంటున్నారు ఎన్టీఆర్ అండ్ మహేష్ ఫాన్స్.