బిగ్ బాస్ సీజన్ 5 లోకి అడుగుపెట్టిన సీనియర్ నటి ప్రియ.. ఏడో వారం వరకు.. చాలా స్ట్రాంగ్ గా నిలబడింది. యంగ్ కంటెస్టెంట్స్ తో పోటీగా నిలవడానికి కారణం అసలు ప్రియలో భయం, బెరుకు లేదు. పోరాడి గెలిచే శక్తి ఉంది. కాకపోతే ఏమనుకున్నా దాచుకోనుందా బయట పెట్టి బ్యాడ్ అయ్యింది. లహరి విషయంలో అనకూడని మాటలతో ప్రియ నోరు జారింది. ఇక నామినేషన్స్ విషయంలో ఒకసారి హమీద మీద, తర్వాత నటరాజ్ మాస్టర్ విషయంలో, ఇంకోసారి లబో పై గొడవకు కాలు దువ్వింది. అంతేకాదు కాజల్ తో ఎక్కువగా గొడవపడే ప్రియ.. లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ లో సన్నీ చెంప పగలగొడతానంది. ఫైనల్ గా ఈ వారం ఎలిమినేట్ అయ్యింది.
అయితే బయటికి వచ్చిన ప్రియ బయట తన ఆట మొదలు పెట్టింది. అంటే బిగ్ బాస్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూన్నాయని, సీజన్ 5 లో కొందరు కంటెస్టెంట్లు బయట వ్యక్తుల సపోర్ట్‌తో షోలో ఎంజాయ్ చేస్తున్నారు అని, బయట కొందరు అందిస్తున్న సహకారంతో బిగ్ బాస్ హౌస్ లో వారు ఎలిమినేట్ కాకుండా ఉంటున్నారు. టాస్క్ ల్లో బాగా ఆడి, నిజాయితీగా ఉండేవారు ఎలిమినేట్ అవుతున్నారని, ప్రియ కంప్లైంట్ చేసినట్లుగా టాక్ అయితే ఉంది.. కానీ ప్రియ కంప్లైంట్ పై ఎక్కడా అఫీషియల్ ప్రకటన లేదు. అయితే ప్రియ హౌస్ లో ఎవరిపై కంప్లైంట్ చేసిందో అనే అనుమానం ఇప్పుడు అందరిలో మొదలయ్యింది.