షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అతనికి బెయిల్ దొరకడం లేదు. షారుఖ్ లాయర్లు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మూడుసార్లు ఆర్యన్ ఖాన్ బెయిల్ రిజెక్ట్ అయ్యింది. ఈలోపు ఆర్యన్ ఖాన్ కేసులో అనన్య పాండే ఎన్సీబీ విచారణ ఎదుర్కొంటుంది. ఆర్యన్ ఖాన్ ఫోన్ వాట్స్ అప్ చాట్ లో ఆర్యన్ ఖాన్ కి అనన్య పాండే కి డ్రగ్స్ గురించిన చాట్ జరగడంతో అనన్య ఇంటిపై ఎన్సీబీ సోదాలు చెయ్యడమే కాదు.. ఆమెని విచారణకు హాజరవ్వాల్సిందిగా సమన్లు కూడా పంపారు.
అయితే మొదటి రోజు అనన్య ఎన్సీబీ విచారణకు హాజరవగా.. మూడు గంటల విచారణ తర్వాత ఆమెని ఆ నెక్స్ట్ డే రమ్మంటే.. అనన్య ఎన్సీబీ ఇచ్చిన టైం కి విచారణకు హాజరు కాలేదు. కొద్దిగా లేట్ గా వెళ్లిన అనన్య ని ఆ రోజు నాలుగు గంటల పాటు ప్రశ్నించిన ఎన్సీబీ అనన్య ని మరోసారి అంటే సోమవారం విచారణకు రావాల్సిందిగా చెప్పారు. కానీ అనన్య పాండే ఈ రోజు ఎన్సీబీ విచారణకు హాజరు కాకపోవడం హాట్ టాపిక్ అయ్యింది. వృత్తి పరమైన కారణాల చేత తాను ఎన్సీబీ విచారణకు హాజరు కాలేకపోయాను అని, మరొక డేట్ లో ఎన్సీబీ విచారణకు వస్తాను అని చెప్పినట్టుగా తెలుస్తుంది. మరోపక్క అనన్య పాండే.. విజయ్ దేవరకొండ తో లైగర్ సాంగ్ షూట్ లో పాల్గొన్నట్లుగా తెలుస్తుంది.