నాగ చైతన్య తో విడిపోతున్నట్లుగా ప్రకటించక ముందు.. చైతు తో సపరేట్ గా ఉంటూనే.. ఫ్రెండ్స్ తో కలిసి సైకిల్ తొక్కడాలు, అలాగే ఒంటరిగా వెకేషన్స్ కి వెళ్లిన సమంత చైతూ తో డివోర్స్ అని ప్రకటించాక మాత్రం.. ఎన్టీఆర్ తో ఎవరు మీలో కోటీశ్వరులు షో కి గెస్ట్ గా వచ్చింది. అప్పుడు అందరి చూపు సమంత మీదే. నిజంగానే ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండే సమంత ఆ షో లో నవ్వింతనంతసేపు ఆ నవ్వులో జీవం లేదు, మొహం లో గ్లో లేదు, ఆమె నవ్వు వెనుక ఆమె అనుభవించిన వేదన కనిపించింది. ఇక రీసెంట్ గా తన బెస్ట్ ఫ్రెండ్ శిల్పా రెడ్డి తో కలిసి ఆధ్యాత్మిక యాత్ర చేసింది.
గంగా హారతి, ఇంకా కొన్ని ఆశ్రమాలు, అలాగే గుళ్ళు గోపురాలు తిరిగిన సమంత.. మళ్ళీ పూర్వం అందం, అలాగే నవ్వుని వెనక్కి తెచ్చుకున్నట్టుగా కనిపిస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో సమంత ఆశ్రమాలు తిరిగి ఆధ్యాత్మికత నుండి బయటికి వచ్చిన అర్వాత ఓ పిక్ ని షేర్ చేసింది. ఆ పిక్ లో సమంత మునుపుటి మాదిరి నవ్వుతూ ఆహ్లాదంగా కనిపించింది. మొహం లో ఎలాంటి బాధ లేనట్టుగా తనని తాని సర్వైవ్ చేసుకుంది అనిపించేలా సమంత కనిపించింది. మరి ఆధ్యాత్మిక భావనలో మనసును ప్రశాంతంగా ఉంచుకుని.. అలా ఆశ్రమాలు అవి చుట్టేసిన సమంత మాత్రం మునుపుపుటి ఉత్సాహంతో మాములు సమంత లా కనిపించడం ఆమె ఫాన్స్ కి ఆనందాన్ని పంచింది. ఇక సమంత తెలుగు, తమిళ్ లో ఒకేసారి రెండు చిత్రాలు చేయబోతుంది.