బిగ్ బాస్ సీజన్ 5 సక్సెస్ ఫుల్ గా 50 రోజులు పూర్తి చేసుకుంది. అంటే అర్ధ సెంచరీ అన్నమాట. బిగ్ బాస్ సీజన్ 5 ఎన్నో అంచనాల నడుమ మొదలైనా.. ఆ అంచనాలను అందుకోవడంలో బిగ్ బాస్ ఎప్పటికప్పుడు విఫలమవుతూనే ఉంది. నామినేషన్స్ లీకవడం, ఎలిమినేట్ అయ్యే పర్సన్ లీకవడం, అసలు ఎంటర్టైన్మెంట్ లేకపోవడం, బిగ్ బాస్ మరీ చప్పగా అనిపిస్తుంది. అలానే 50 రోజులు కంప్లీట్ చేసుకుంది అంటే మాములు విషయం కాదు. ఇక నిన్న ఆదివారం హౌస్ నుండి ప్రియా, అని మాస్టర్స్ లో ఎవరో ఒకరు బయటకి వెళ్లే విషయంలో నాగార్జున కాస్త సస్పెన్స్ ప్లాన్ చేసినా.. చివరికి ప్రియా హౌస్ ని వీడింది.
ఇక నేడు సోమవారం నామినేషన్స్ డే. ఈ రోజు హౌస్ లో నామినేషన్స్ విషయంలో ఎలాంటి గొడవ.. ఎలాంటి రాసా భాసా జరగలేదు. కానీ బిగ్ బాస్ ఎమోషన్స్ మధ్యన చిచ్చు పెట్టాడు. పోస్ట్ బాక్స్, లెటర్ బాంబు బిగ్‌బాస్ ఇంటిలో నామినేషన్ ప్రక్రియను లెటర్స్‌ను ఆధారంగా చేసుకొని మొదలు పెట్టారు. కన్ఫెషన్ రూమ్‌లో ఉండే కంటెస్టెంట్లు.. ఎవరికైతే తమ తోటి కంటెస్టెంట్లకు లెటర్స్ ఇస్తారో వారు నామినేషన్ ప్రక్రియలో ఉండదు. అదే లెటర్ ఎవరికైతే ఇవ్వరో వారు నామినేషన్ ప్రక్రియలో ఉంటారు అని బిగ్‌బాస్ నిబంధన చెప్పారు. అయితే కొందరు సభ్యులు తమ తోటి సభ్యులకు లెటర్స్ ఇవ్వడానికి నిరాకరిస్తూ.. వాటిని స్క్రాప్ చేయడం తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో కనిపించింది.
అయితే సోమవారం నామినేషన్స్ లో కాస్త గట్టి అంటే టాప్ 5 సభ్యులు నామినేట్ అవడం ఆసక్తికరంగా మరింది. ఈ వారం నామినేషన్స్ లో సిరి, షణ్ముఖ్ , శ్రీరామచంద్ర, మానస్, యాంకర్ రవి, లోబో లు ఉన్నారు. లీకైన సమాచారం ప్రకారం వీరు నామినేషన్స్ లోకి వెళ్లగా.. ఈ వారం ఎవరు బయటికి వెళతారు అనే దానిపై అందరిలో ఆసక్తి మొదలైంది.