రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ - ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఆర్.ఆర్.ఆర్ మూవీ జనవరి 7 2022 న రిలీజ్ కాబోతుంది. ఈ దీపావళి నుండి ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ ని రాజమౌళి పక్కా ప్లానింగ్ తో మొదలు పెట్టబోతున్నారని.. హైదరాబాద్, బెంగళూర్, చెన్నై, ముంబై లాంటి సిటీస్ లో ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ లో ఓ రేంజ్ లో ఉండబోతున్నాయంటూ ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా ఆర్.ఆర్.ఆర్ రన్ టైం పై షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలు అంటే.. సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. ఒక్కొక్కరికి స్క్రీన్ స్పేస్ ఎంత ఉంటుంది అనేది అందరిలో ఉన్న ఆసక్తి. అలాగే ఇద్దరు హీరోలు కలిసి నటించిన సినిమా నిడివి ఎంత ఉంటే ఫాన్స్ శాటిస్ఫాయ్ అవుతారనేది కూడా ఇంట్రెస్ట్ కలిగించే అంశమే.
ఎప్పుడూ తన సినిమాలను 2.30 నిమిషాల లోపు ఉండేలా చూసుకునే రాజమౌళి.. ఆర్.ఆర్.ఆర్ విషయంలో నిడివి పెంచేశారని.. ఆర్.ఆర్.ఆర్ రన్ టైం ఏకంగా 2.45 నిముషాలు ఉండబోతుంది అని, బాహుబలి సెకండ్ పార్ట్ ని కూడా 2.47 నిమిషాల నిడివి తో ప్రేక్షకులను మెప్పించిన రాజమౌళి.. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ నిడివి కూడా అదే రేంజ్ లో ఉంచినట్లుగా టాక్. సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ తోపాటు మంచి ఎమోషన్స్ ఎక్కువగా ఉన్నాయి అందులో ఏది ఉంచాలి, ఏది తీసెయ్యాలన్నా కష్టంగా ఉండడంతో రాజమౌళి ఫైనల్ గా ఆ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక రెండు గంటల సినిమా ఒక ఎత్తు అయితే లాస్ట్ 30 నిమిషాల ఎపిసోడ్ మరో ఎత్తు అనేలా ఆర్.ఆర్.ఆర్ మూవీ ఉండబోతుంది అని తెలుస్తుంది.