ముంబై క్రూయిజ్ రేవ్ పార్టీలో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం ముంబై లోని ఆర్థర్ రోడ్ జైలులో ఉన్న షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కి బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ.. ఇప్పుడు ఆర్యన్ ఖాన్ కేసు విషయంలో ఓ బిగ్ ట్విస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎన్సీబీ ఈ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ ని ప్లాన్ ప్రకారమే ఇరిక్కించింది అని, ఇది ఒక ఫ్రాడ్ కేసు అంటూ కిరణ్ గోసావి బాడీగార్డ్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆర్యన్ ఖాన్ ని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన రోజున ఆర్యన్ ఖాన్ తో ఖాళీ పేపర్స్ పై ఎన్సీబీ అధికారి సంతకాలు చేయించున్నారని, ఈ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయంపై తనకు పెద్దగా తెలియదని, ఇలాంటి కేసుల్లో సాక్షులు చనిపోవడం, లేదా కనిపించకుండా పోవడం చూస్తున్నట్టుగానే తనకి ప్రాణహాని ఉంది అంటూ ప్రభాకర్ సంచలనంగా మట్లాడాడు.
క్రూయిజ్‌షిప్ లో ఎన్సీబీ రైడ్ చేసిన సమయంలో తాను గోసవితో ఉన్నానని.. ఆ రాత్రి ఎన్సీబీ ఆఫీస్ దగ్గర సామ్ అనే వ్యక్తిని గోసవి కలవడం చూశానని ప్రభాకర్ చెబుతున్నాడు. అయితే తనకి ఈ విషయాలు తెలుసు కాబట్టి ఎన్సీబీ అధికారి తనని వదిలిపెట్టాడని, నిజాలను మాత్రమే చెప్పి ప్రాణాలను నిలబెట్టుకోవాలని అనుకుంటున్నట్లుగా ప్రభాకర్ చెబుతున్నాడు. గోసావి సామ్ తో ఫోన్‌లో 25 కోట్ల గురించి మాట్లాడుతున్నారని, అయితే దానిని 18 కోట్లకు ఫిక్స్ చేయడం గురించి కూడా మాట్లాడుకున్నారంటూ ప్రభాకర్ చెబుతున్నాడు. అందులో ఎన్సీబీ ఆఫీసర్ సమీర్ వాంఖడేకి 8 కోట్ల రూపాయలు ఇవ్వాలని వారు అనుకుంటున్నారని చెప్పి ఈ కేసులో బిగ్ ట్విస్ట్ ని బయటపెట్టాడు సాక్షి ప్రభాకర్ సెయిల్.