విజయ్ దేవరకొండ చాలా తక్కువ టైం లోనే స్టార్ హీరోగా మారాడు. చేసింది కొద్ది సినిమాలే అయినా.. చాలా త్వరగా పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టాడు. తర్వాత విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా హీరో అయ్యాడు. దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న ఆనంద్ దేవరకొండ.. ప్రస్తుతం పుష్పక విమానం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా విజయ్ అండ్ ఆనంద్ లు ఓ స్పెషల్ చిట్ చాట్ అంటూ ఓ వీడియో రిలీజ్ చేసారు. టాలీవుడ్ యంగ్ హీరోస్ ఒక్కొక్కరిగా పెళ్లిళ్లు చేసుకుంటున్న నేపథ్యంలో అందరూ విజయ్ దేవరకొండ ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడనే ప్రశ్న వేస్తున్నారు.
మొన్నా మధ్యన టాప్ హీరోయిన్ రష్మిక మందన్నతో విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నాడనే ప్రచారం జరిగింది. అటు రష్మిక ఇటు విజయ్ దేవరకొండ ఇద్దరూ.. తమ మధ్యన స్నేహం తప్ప ప్రేమ లేదని తేల్చేసారు. ఇక అప్పటినుండి విజయ్ దేవరకొండ పెళ్లి పై అందరిలో క్యూరియాసిటీ మొదలైంది. అయితే తమ్ముడు ఆనంద్ దేవరకొండ తో విజయ్ దేవరకొండ చేసిన స్పెషల్ చిట్ చాట్ లో విజయ్ దేవరకొండ తన పెళ్లి పై స్పందించాడు. తన కంటే ముందు తమ్ముడి ఆనంద్ పెళ్లి ఉంటుందంటూ ఫన్నీ కామెంట్ చేసాడు. అంటే తమ్ముడి పెళ్లి తర్వాత తాను పెళ్లి చేసుకుంటాను అని ఓ క్లారిటీ అయితే ఇచ్చాడు.