Advertisementt

హీరోయిన్స్ అంటే కంఫర్ట్.. నిర్మాత అంటే

Sun 24th Oct 2021 04:46 PM
liger producer,actress charmi,charmee,charmee shocking comments  హీరోయిన్స్ అంటే కంఫర్ట్.. నిర్మాత అంటే
Charmi Shocking comments on acting హీరోయిన్స్ అంటే కంఫర్ట్.. నిర్మాత అంటే
Advertisement
Ads by CJ

హీరోయిన్స్ గ్లామర్ గా కనిపించాలంటే ఫిట్ గా ఉండాలి, అందుకోసం జిమ్ చేస్తే సరిపోతుంది. మహా అయితే బ్యూటీ పార్లల్ కి వెళితే సరిపోతుంది. టాప్ రేంజ్ హీరోయిన్స్ ప్రత్యేకంగా బ్యూటీ పార్లల్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. వాళ్ళకే స్పెషల్ స్టైలిస్ట్ లు ఉంటారు. ఇప్పుడొక మాజీ హీరోయిన్ ఏం చెబుతుంది అంటే హీరోయిన్స్ అయితే ఫిట్ నెస్ పై దృష్టి పెడితే సరిపోతుంది. కానీ నిర్మాత అంటే చాలా బాధ్యతలు ఉంటాయంటుంది. ఆమె ఎవరో కాదు.. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ లైగర్ కి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఛార్మి. ఛార్మి ఒకప్పుడు హీరోయిన్ గా ప్రభాస్, నాగ్ లాంటి హీరోలతో నటించి అవకాశాలు తగ్గగానే.. పూరి తో కలిసి నిర్మాతగా మారిపోయింది.

నిర్మాతగా మారాక ఛార్మికి నటించే అవకాశం వచ్చినా ఆమె నటన వైపు రావడం లేదు. తాజాగా తనకు మంచి కేరెక్టర్స్ వస్తున్నాయని చెప్పిన ఛార్మి, హీరోయిన్ గా ఉండడంలో ఎక్కువ కంఫర్ట్ ఉంటుంది. జస్ట్ ఫిట్ నెస్ మీద దృష్టి పెడితే సరిపోతుంది. అదే నిర్మాతగా మారితే అది అంత తేలికైన విషయమేం కాదు. నిర్మాతగా అందరి కంఫర్టును చూడవలసి ఉంటుంది. హీరోయిన్ గా ఉన్నప్పుడు నా పని నేను చూసుకునేదాన్ని, కానీ నిర్మాతగా గాడిద చాకిరీ చెయ్యాల్సి వస్తుంది.. అలా నేను చెయ్యలేను, అని చెప్పను.. నాకు అదే ఇష్టం. కాకపోతే నాకు అవకాశాలు వచ్చినా.. ఇక నటించే ఉద్దేశ్యం అయితే లేదు అని ఖరాకండిగా చెప్పేసింది. 

Charmi Shocking comments on acting:

Liger Producer Charmi Shocking comments

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ