Advertisementt

అనసూయ కి షాక్ ఇచ్చిన తమన్నా

Sun 24th Oct 2021 10:15 AM
tamannaah,masterchef event,anasuya,anchor anasuya,anasuya masterchef,tamannaf masterchef event  అనసూయ కి షాక్ ఇచ్చిన తమన్నా
Anasuya vs Tamannaah అనసూయ కి షాక్ ఇచ్చిన తమన్నా
Advertisement
Ads by CJ

గ్లామర్ హీరోయిన్ తమన్నా ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో అదరగొట్టేసింది. గోపీచంద్ తో సీటిమార్, నితిన్ తో చేసిన మ్యాస్ట్రో మూవీ తమన్నాకి మంచి హిట్స్ ఇచ్చాయి. ఇక తమన్నా హోస్ట్ గా జెమినీ ఛానల్ మాస్టర్ చెఫ్ అనే ప్రోగ్రాం ని గ్రాండ్ గా మొదలు పెట్టింది. బెంగుళూరు లో వేసిన ఓ రిచ్ సెటప్ లో మాస్టర్ చెఫ్ ప్రోగ్రాం షూటింగ్ చిత్రీకరణ జరుగుతుంది. కొన్ని వారాలుగా తమన్నా గ్లామర్ గా మాస్టర్ చెఫ్ హోస్ట్ గా అదరగొట్టేస్తుంది. అయితే ఉన్నట్టుండి తమన్నా ప్లేస్ లోకి టాలీవుడ్ టాప్ యాంకర్ అనసూయ వచ్చి చేరింది. ఇప్పటికే అనసూయ ఎపిసోడ్స్ బుల్లితెర మీద ప్రసారం అవుతున్నాయి కూడా. అయితే మాస్టర్ చెఫ్ ప్రోగ్రాం కి జెమిని ఛానల్ ఆశించిన టీఆర్పీ రాకపోవడంతో తమన్నా ని తప్పించారని, కాదు తమన్నా మాస్టర్ చెఫ్ డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోవడంతో ఆమె ప్లేస్ లోకి అనసూయని తీసుకున్నారని అన్నారు.

జబర్దస్త్ యాంకర్ గా అదరగొడుతున్న అనసూయ మాస్టర్ చెఫ్ ప్రోగ్రాం కి వస్తే.. షో కి రేటింగ్ వస్తుంది అని నిర్వాహకులు భావించారు. ఇలాంటి సమయంలో తమన్నా ఈ ప్రోగ్రాం నుండి తనని తప్పించినందుకు గాను మాస్టర్ చెఫ్ నిర్వాహకులకు షాకిచ్చింది. తనని తప్పించి అనసూయని షో కి హోస్ట్ గా తీసుకున్నందుకు గాను తమన్నా తీవ్ర అసహనంతో మాస్టర్ చెఫ్ ఈవెంట్ నిర్వాహకులకు నోటీసు లు ఇచ్చింది అని, తనకి రావవల్సిన పారితోషకం బకాయి చెల్లించమని నోటీసు లు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే తమన్నా లాయర్ ఈ విషయమై స్పందిస్తూ తన క్లయింట్ తమన్నా ఈ మాస్టర్ చెఫ్ ప్రోగ్రాం కోసం పలు ప్రాజెక్టులు వదులుకొన్నారు.

ఈ షోకు సంబంధించిన తొలి సీజన్‌ను పూర్తి చేయడానికి కొన్ని ముఖ్యమైన పనులను ఆమె క్యాన్సిల్ చేసుకొన్నారు అని.. కానీ ఇప్పుడు తమన్నాని తొలగించారని.. అంతేకాకుండా తనకు రావాల్సిన బకాయిలు చెల్లించకుండా ప్రొడక్షన్ హౌస్ కమ్యునికేషన్ ఆపేసింది అని, అందుకే తమన్నా నోటీసులు ఇచ్చినట్లుగా ఆమె లాయర్ చెబుతున్నారు.

Anasuya vs Tamannaah:

Tamannaah initiates legal action against the MasterChef

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ