ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ టిడిపి నేత పట్టాభిని విజయవాడ గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో బుధవారం రాత్రి విజయవాడ పటమటలోని ఆయన ఇంటివద్ద పోలీసులు హైడ్రామా నడుమ అరెస్టు చేసి స్టేషన్ కి తరలించి.. గురువారం సాయంత్రం పట్టాభిని విజయవాడ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అదే రోజు రాత్రి మచిలీపట్నం జైలుకు తరలించి కొవిడ్ పరీక్షలు నిర్వహించిన అనంతరం మరుసటి రోజు అక్కడి నుంచి రాజమహేంద్రవరం జైలు తరలించారు
పట్టాభిరామ్ ప్రస్తుతం రాజమహేంద్రవరం జైలులో ఉన్నారు. అయితే పట్టాభి తనకి బెయిల్ ఇప్పించాలంటూ హై కోర్టు లో పిట్రిషన్ దాఖలు చేసారు. పట్టాభి తరపు లాయర్ వాదనలు విన్న హై కోర్టు తాజాగా పట్టాభిరామ్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఇక పట్టాభి రాజమహేంద్రవరం జైలు నుండి మరికాసేపట్లో విడుదల కానున్నారు.