Advertisementt

కొడుకు కొట్టాడు హిట్.. తండ్రి ఇచ్చాడు పార్టీ

Sat 23rd Oct 2021 04:03 PM
king nagarjuna,hosted a party,akhil,most eligible bachelor movie,celebrate the blockbuster success,akhil most eligible bachelor  కొడుకు కొట్టాడు హిట్.. తండ్రి ఇచ్చాడు పార్టీ
Nagarjuna hosted a party to celebrate the blockbuster success of Most Eligible Bachelor కొడుకు కొట్టాడు హిట్.. తండ్రి ఇచ్చాడు పార్టీ
Advertisement
Ads by CJ

అక్కినేని వారసులు నాగ చైతన్య - అఖిల్ లు ఇప్పుడు తమ తమ సినిమాల హిట్ తో ఎంజాయ్ చేస్తున్నారు. నాగ చైతన్య కి లవ్ స్టోరీ రూపంలో సూపర్ హిట్ పడగా.. మూడు సినిమాల ప్లాప్స్ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో అఖిల్ ఫస్ట్ టైం హిట్ కొట్టాడు. నాగార్జునకి ఇద్దరు కొడుకులు ఒకేసారి సక్సెస్ కొట్టడం చూసి ఆనందంగా ఫీలవుతున్నారట. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య - సాయి పల్లవి కాంబోలో తెరకెక్కిన లవ్ స్టోరీ సెప్టెంబర్ 24 న థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో భారీ కలెక్షన్స్ కొల్లగొట్టింది.

ఇక బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో పూజ హెగ్డే తో కలిసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అన్న అఖిల్.. గత వారం దసరా స్పెషల్ గా సినిమాని రిలీజ్ చేసి పాజిటీవ్ టాక్ తెచ్చుకున్నాడు. అయితే సినిమాకి ఎలాంటి టాక్ వచ్చినా అఖిల్ అండ్ టీం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కి చేసిన ప్రమోషన్స్ ఆ సినిమాని లాభాల్లో నిలబెట్టింది. సో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మేకర్స్ హ్యాపీ. దానితో నాగ్ హ్యాపీ. అఖిల్ మోస్ట్ బ్యాచిలర్ తో హిట్ కొట్టి.. సినిమా ప్రమోషన్స్ ముగించుకుని రిలాక్స్ అవడంతో.. నాగ్ ఇప్పుడు ఓ పార్టీ ఆరెంజ్ చేసారు. అది కూడా టాలీవుడ్ లోని కొద్దిమంది టాప్ డైరెక్టర్స్ అండ్ సన్నిహితులకు నాగ్ పార్టీ ఏర్పాటు చేసారు. ఈ పార్టీకి సుకుమార్, హరీష్ శంకర్, ఇంకా మోస్ట్ బ్యాచులర్ టీం, అఖిల్ తల్లి అమల హాజరయ్యారు. 

Nagarjuna hosted a party to celebrate the blockbuster success of Most Eligible Bachelor:

King Nagarjuna hosted a party to celebrate the blockbuster success of Akhil Most Eligible Bachelor

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ