బిగ్ బాస్ 5 ఏడో వారంలో కెప్టెన్సీ టాస్క్ లో నలుగురైదుగురు కెప్టెన్సీ కోసం హోరా హోరీగా తలపడ్డారు. రవి, కాజల్, సన్నీ, మానస్, శ్రీరామ్, విశ్వ, అని మాస్టర్ లు కెప్టెన్సీ టాస్క్ కోసం యుద్ధం చెయ్యగా.. ఫైనల్లీ బెలూన్ ని కాపాడుకుని సన్నీ కెప్టెన్ అయ్యాడు. కొన్ని వారాలుగా సన్నీ కి కెప్టెన్ అనేది అందని ద్రాక్ష లా తయారైంది. నాకో ఛాన్స్ ఇవ్వండి బిగ్ బాస్ అంటూ వేడుకుంటున్నాడు. గత రాత్రి కెప్టెన్సీ టాస్క్ లో సన్నీ, రవి, కాజల్, విశ్వ, మానస్ లు బెలూన్స్ ని కాపాడుకుంటూ తిరగాలి. కాజల్ విశ్వ నువ్వు రెండుసార్లు అయ్యావ్ గా అనగానే విశ్వ తన బెలూన్ పగలగొట్టుకుంటాడు. తర్వాత రవి మానస్ బెలూన్ పగలగొట్టగా.. ఆ తర్వాత కాజల్ బెలూన్ పగులుతుంది. ఇక సన్నీకి ఆని మాస్టర్ పిన్ ఇస్తుంది. ఆ తర్వాత రవి, సన్నీ మాట్లాడుకుని ఫైనల్ గా రవి బెలూన్ పగలగొట్టగా సన్నీ కెప్టెన్ అయ్యాడు.
సన్నీ కెప్టెన్ అవ్వగానే మంచి డ్రెస్ వేసి, స్టయిల్ గా రెడీ అయ్యి అందరి తో చక్కగా మాట్లాడుతూ కలిసిపోయాడు. ఆఖరికి తాను గొడవ పడిన ప్రియా దగ్గరికి వెళ్లి మీరేమ్ చేస్తారు.. బెడ్ రూమ్ ఓకె నా పని చెయ్యడానికి అంటూ ప్యాచప్ చేసుకున్నాడు. మానస్ దగ్గరికి వెళ్లి బిగ్ బాస్ గేమ్ ని ఎలా తిప్పుతాడో తెలియదురా ఫైనల్లీ నేను కెప్టెన్ అయ్యా.. చాలా హ్యాపీ రా.. ఒకవేళ ఆ అవకాశం రాకపోతే నెను ఓ పిన్ నాదగ్గర పెట్టుకున్నాను. దానితో అందరి బెలూన్స్ పగలగొట్టాలని అని మానస్ కి చెబుతాడు సన్నీ. ఇక నేడు నాగ్ ఎపిసోడ్ లో ఎవరికీ తిట్లు పడతాయి.. ఎవరిని మెచ్చుకుంటాడో చూద్దాం.