Advertisementt

సోషల్ మీడియాని కబ్జా చేసిన ప్రభాస్ ఫాన్స్

Fri 22nd Oct 2021 10:37 PM
prabhas,radhe shyam teaser,salaar,adipurush,hashtag,trends on twitter,prabhas radhesyam,prabhas salaar,prabhas adipurush  సోషల్ మీడియాని కబ్జా చేసిన ప్రభాస్ ఫాన్స్
Prabhas fans Conquering social media సోషల్ మీడియాని కబ్జా చేసిన ప్రభాస్ ఫాన్స్
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే వేడుకలు మరికొద్ది గంటల్లో మొదలు కాబోతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లో మీడియా మిత్రులకి ప్రభాస్ పీఆర్ టీం గ్రాండ్ గా పార్టీ ఆరంజ్ చేసింది. ఇక ప్రభాస్ నటించిన సినిమాల నుండి రేపు అంటే అక్టోబర్ 23 న లుక్స్, టీజర్స్, పోస్టర్స్, రిలీజ్ డేట్స్ బాబోయ్ హడావిడి హంగామా మాములుగా ఉండదు. రాధేశ్యామ్ నుండి టీజర్ ట్రీట్ ఇవ్వబోతున్నట్టుగా టీం ఎప్పుడో ప్రకటించింది. దానికే రాధేశ్యామ్ టీజర్ డే అంటూ సోషల్ మీడియాని గత వారం రోజులుగా ప్రభాస్ ఫాన్స్ ఊపేస్తూ #Radhesyamteaser హాష్ టాగ్ ట్రెండ్ చేస్తున్నారు. ఇక తాజాగా #Salaar హాష్ టాగ్ ట్రేండింగ్ లోకి వచ్చింది. మరి ప్రశాంత్ నీల్ ప్రభాస్ కోసం సలార్ నుండి ఏం సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాడో అనే ఆత్రుత ఫాన్స్ లో కనిపిస్తుంది.

మరోపక్క ఆదిపురుష్ హాష్ టాగ్ ని ట్రేండింగ్ లోకి తీసుకువచ్చారు ప్రభాస్ ఫాన్స్. ఆదిపురుష్ నుండి రాముడిగా ప్రభాస్ ఫస్ట్ లుక్ ని ఎక్సపెక్ట్ చేస్తున్నారు వారు. ఇక నాగ్ అశ్విన్ - ప్రభాస్ కాంబో ప్రాజెక్ట్ కే నుండి ఏదో ఒక అప్ డేట్ రాకపోదు అనే ధీమాతో ప్రాజెక్ట్ కే హాష్ టాగ్ ని మొదలు పెట్టారు. ఇక స్పిరిట్ నుండి సందీప్ వంగా ఎలాంటి అప్ డేట్ డేట్ ఇస్తాడో అని వెయిటింగ్. ఇదంతా అలా ఉంటే #Prabhas హాష్ టాగ్ ని ట్రెండ్ చేస్తూ కొత్త ప్రాజెక్ట్స్ ప్రకటనతో ప్రభాస్ ఇంకెన్ని సర్ ప్రైజ్ లు ఇస్తాడో అంటూ వాళ్ళు సోషల్ మీడియా మొత్తం ప్రభాస్ సినిమాలు, ప్రభాస్ టైటిల్స్, ప్రభాస్ పేరు హాష్ టాగ్స్ ట్రెండ్స్ చేస్తూ మరొకరికి ఛాన్స్ ఇవ్వకుండా మొత్తాన్ని కబ్జా చేసిపడేసారు. 

Prabhas fans Conquering social media:

Prabhas and Radheshyam Teaser and Salaar and Adipurush hashtag trends on Twitter

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ