Advertisementt

మ్యూజిక్ డన్ అంటున్న సర్కారు వారి పాట

Fri 22nd Oct 2021 07:32 PM
s.s.thaman,sarkaru vaari paata movie,mahesh babu,mahesh babu sarkaru vaari paata,keerthy suresh,parsuram  మ్యూజిక్ డన్ అంటున్న సర్కారు వారి పాట
Thaman finishes composing for Sarkaru Vaari Paata మ్యూజిక్ డన్ అంటున్న సర్కారు వారి పాట
Advertisement
Ads by CJ

మహేష్ బాబు - పరశురామ్ కాంబోలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట మూవీ షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్ లో జరుగుతుంది. రీసెంట్ గానే సర్కారు వారి పాట టీం స్పెయిన్ వెళ్ళింది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అలా వైకుంఠపురములో మూవీ తో బ్లాక్ బస్టర్ కొట్టిన మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా సంక్రాతి 2022 స్పెషల్ గా రిలీజ్ కి సిద్దమవుతుంది. నిన్నటివరకు సంక్రాంతికి ముందు ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అవుతుంది.. సో సర్కారు వారి పాటు వెనక్కి తగ్గుతుంది అన్నప్పటికీ.. సర్కారు వారి పాట టీం మాత్రం సంక్రాంతికే ఫిక్స్ అయ్యారు. 

ఇక తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాపై చిన్నపాటి అప్ డేట్ ఇచ్చాడట. అదేమిటంటే సర్కారు వారి పాట మ్యూజిక్ డన్ అంటూ మహేష్ తో కలిసి ఉన్న ఫొటో ని సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో మహేష్ ఫాన్స్ ఆగడం లేదు. ఇక కీర్తి సురేష్ బర్త్ డే రోజున కీర్తి సురేష్ గ్లామర్ పిక్ తో ఆమెకి విషెస్ చెప్పడంతో.. ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్ గ్లామర్ గా కనిపించబోతుంది అని.. తెలుస్తుంది. మహేష్ స్టైలిష్ గా, సూపర్ మేకోవర్ లో సర్కారు వారి పాటలో కనిపిస్తున్నాడు. ఇక ఇప్పుడు మ్యూజిక్ కూడా పూర్తి కావడంతో.. సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది. 

Thaman finishes composing for Sarkaru Vaari Paata:

Thaman completes Sarkaru Vaari Paata tunes

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ