Advertisementt

చిరు - బాబీ మూవీకి ముహూర్తం ఫిక్స్

Fri 22nd Oct 2021 10:41 AM
chiranjeevi,bobby,chiranjeevi-bobby film,mytri movie makers,devi sri prasad music director,waltair vasu,veeraiah  చిరు - బాబీ మూవీకి ముహూర్తం ఫిక్స్
Chiranjeevi-Bobby film readies for a regular shoot చిరు - బాబీ మూవీకి ముహూర్తం ఫిక్స్
Advertisement
Ads by CJ

చిరంజీవి ప్రస్తుతం కుడి చేతి కి ఆపరేషన్ చేయించుకుని గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ కి విరామం ఇచ్చి ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. గాడ్ ఫాదర్ కి సంబందించిన యాక్షన్ ఘట్టాలను పూర్తి చేసిన చిరంజీవి మెహెర్ రమేష్ తో భోళా శంకర్, బాబీ తో కొత్త ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు మొదలు పెడతారా అని మెగా ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. కొరటాల శివ తో ఆచార్య ఆల్మోస్ట్ ఫినిష్ అవడంతో రిలాక్స్ అయిన చిరు గాడ్ ఫాదర్ తో పాటుగా భోళా శంకర్, బాబీ మూవీస్ ని పట్టాలెక్కిద్దామని అనుకున్నా ఆయన కుడి చేతి గాయం వలన రెస్ట్ తీసుకుంటున్నారు. 

అయితే తాజాగా డైరెక్టర్ బాబీ - చిరు కాంబో మూవీ కి ముహూర్తం ఫిక్స్ అయ్యింది అని.. అది దివాళి తర్వాత నవంబర్ 6 నుండి బాబీ - చిరు కాంబో ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతున్నట్లుగా చెబుతున్నారు. చిరంజీవి బర్త్ డే కె ప్రీ పోస్టర్ తో సినిమాపై అంచనాలు రేపిన బాబీ.. ఈ సినిమాకి వాల్తేరు వాసు అయినా లేదంటే వీరయ్య టైటిల్స్ పెడితే మాస్ ప్రేక్షకులకి బాగా ఎక్కుతుంది అని భావిస్తున్నారు. ఈ రెండు టైటిల్స్ లో ఫైనల్ గా ఏదో ఒక టైటిల్ చిరు - బాబీ సినిమాకి పెట్టొచ్చని అంటున్నారు. ఇక ఈ సినిమాకి  దేవిశ్రీ ప్రసాద్‌ సంగతీం అందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్‌ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.

Chiranjeevi-Bobby film readies for a regular shoot:

Chiranjeevi-Bobby combo muhurtham fix

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ