Advertisementt

డైరెక్టర్ శంకర్ అల్లుడుపై కేసు నమోదు

Thu 21st Oct 2021 05:17 PM
shankar,shankar son in law,booked under pocso,shankar son in law rohit damodaran,cricketer rohit damodaran  డైరెక్టర్ శంకర్ అల్లుడుపై కేసు నమోదు
Shankar son in law Rohit Damodaran lands in trouble డైరెక్టర్ శంకర్ అల్లుడుపై కేసు నమోదు
Advertisement
Ads by CJ

కోలీవుడ్ డైరెక్టర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో చెయ్యబోయే పాన్ ఇండియా ఫిలిం RC15 ని సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నారు. వచ్చే వారం పట్టాలెక్కనున్న RC15 సినిమా షూటింగ్ పూణే, మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చెయ్యగా.. ఇప్పుడు శంకర్ ఒక సమస్యలో ఇరుక్కున్నారు. అదేమిటంటే శంకర్ అల్లుడు రోహిత్ దామోదరన్‌ లైగింక వేధింపుల కేసులో ఇరుక్కున్నాడు. ఈ ఏడాది జూన్‌లో శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్య కి తమిళ క్రికెట్ క్లబ్‌కు కెప్టెన్‌గా చేస్తున్న రోహిత్ దామోదరన్‌ తో వివాహం జరిపించారు. అయితే రోహిత్ దామోదరన్‌ మరో ఐదుగురితో కలిసి క్రికెట్ కోచింగ్ కోసం వచ్చిన 16 ఏళ్ల బాలికను లైంగిక వేధింపులకు గురి చేసారని తెలుస్తుంది.

లైగింక వేధింపుల ఆరోపణలతో మంగళవారం పుదుచ్చేరిలో రోహిత్ దామోదరన్‌‌ పై అలాగే మరో ఐదుగురిపై కేసు నమోదు అయ్యిందని తెలుస్తోంది. పదహారేళ్ల బాలికను లైగింకంగా వేధించినందుకు మొత్తం ఐదుగురిని పోక్సో చట్టం కింద కింద బుక్ చేసినట్లు సమాచారం. అయితే ఆ అమ్మాయిని వేధించిన రోహిత్ బ్యాచ్ ఒకవేళ ఈ విషయాన్ని అధికారులకు ఫిర్యాదు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించారని ఆ బాలిక ఆరోపించడం గమనార్హం.

Shankar son in law Rohit Damodaran lands in trouble:

Shankar son in law in trouble: booked under POCSO

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ