యంగ్ హీరో శర్వానంద్ వరస సినిమాలతో కెరీర్ లో బిజీగా ఉంటున్నాడు. అయితే శర్వానంద్ కథల ఎంపికలో లోపమో.. లేదంటే ఆయనకి దొరికే డైరెక్టర్స్ ప్రాబ్లమ్ తెలియదు కానీ.. గత కొన్నేళ్లుగా శర్వానంద్ కి సరైన హిట్ తగల్లేదు. మారుతీ కాంబోలో మహానుభావుడు సినిమా తర్వాత శర్వానంద్ కి వరస ప్లాప్ లే తగులుతున్నాయి. ఆఖరికి హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలకు కలెక్షన్స్ రావడం లేదు. మహానుభావుడు తర్వాత చేసిన పడిపడి లేచే మనసు సినిమా అందరూ బాగుంది అన్నారు.. కానీ కలెక్షన్స్ నిల్. ఇక మాస్ ఎంటర్టైనర్ రణరంగం అట్టర్ ప్లాప్. ఆ తర్వాత తమిళ రీమేక్ జాను కూడా.. హిట్ అనే టాక్ పడింది.. కానీ జాను కూడా కలెక్షన్స్ కొల్లగొట్టలేక చేతులెత్తేసింది.
ఇక ఈ ఏడాది శ్రీకారం పరిస్థితి అంతే. ఇండియా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు శ్రీకారం సినిమా చూసి అబ్బో అన్నారు.. కానీ ఆ సినిమాకి కలెక్షన్స్ రాలేదు. ఇక ఇండస్ట్రీలో చాలామంది రిజెక్ట్ చేసిన అజయ్ భూపతి మహా సముద్రం సినిమా చేసాడు. ఆ సినిమా శర్వానంద్ ని నిలబెట్టలేకపోయింది.. ఆ సినిమాకి నెగెటివ్ టాక్ పడింది. మరి శర్వానంద్ వరసగా కథల ఎంపిక లో ఫెయిల్ అవుతున్నట్టే కనిపిస్తుంది. ఇప్పటికైనా అలోచించి అడుగు వెయ్యి సామి అంటూ శర్వానంద్ అభిమానులు శర్వా ని వేడుకుంటున్నారు.
ఇక శర్వానంద్ తదుపరి సినిమాలు ఒకే ఒక జీవితం, ఆడవాళ్లు మీకు జోహార్లు.. మరి ఈ సినిమాలేం చేస్తాయో శర్వాని చూడాలి.