రాధేశ్యామ్ క్లైమాక్స్ బడ్జెట్ వింటే..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - జిల్ ఫేమ్ రాధాకృష్ణ కలయికలో యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న రాధేశ్యామ్ మూవీ హడావిడి మొదలైపోయింది. ఇప్పటివరకు రాధేశ్యామ్ పోస్టర్స్, రాధేశ్యామ్ గ్లిమ్బ్స్ తో సరిపెట్టుకున్న ఫాన్స్ కి ప్రభాస్ బర్త్ డే రోజున రాధేశ్యామ్ టీజర్ తో ట్రీట్ ఇవ్వబోతున్నారు. ప్రభాస్ - పూజ హెగ్డే కాంబోలో తెరకెక్కిన రాధేశ్యామ్ పై ట్రేడ్ లో, పాన్ ఇండియా మార్కెట్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. గత రెండు రోజులుగా ప్రభాస్ ఫాన్స్ రాధేశ్యామ్ టీజర్ హడావుడిని సోషల్ మీడియాలో మొదలుపెట్టి.. ప్రభాస్ బర్త్ డే వరకు ఆపేలా లేరు. వచ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్ గా రిలీజ్ కాబోతున్న రాధేశ్యామ్ పై ఇప్పుడో షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

అది రాధేశ్యామ్ క్లైమాక్స్ న్యూస్. ఇప్పటికే రాధేశ్యామ్ క్లైమాక్స్ చాలా డిఫ్రెంట్ గా ఉండబోతుంది అని, రాధేశ్యామ్ క్లైమాక్స్ విషాదాంతంగా ముగియబోతుంది అనే ప్రచారం ఉండగా.. ఇప్పుడు రాధేశ్యామ్ క్లైమాక్స్ ప‌దిహేను నిమిషాల పాటు ఉంటుంద‌ట‌. ఈ ప‌దిహేను నిమిషాల క్లైమాక్స్ ఎపిసోడ్ కోసం యూవీ క్రియేషన్స్ వారు ఏకంగా యాబై కోట్లు ఖ‌ర్చు పెట్టి చిత్రీక‌రించార‌ట‌. ఈ రాధేశ్యామ్ క్లైమాక్స్ సీన్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేలా చ‌క్క‌టి యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో తెరకెక్కించారని.. ఈ సీన్ సినిమాకే హైలెట్ అనేలా ఉండబోతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంటే ప్రభాస్ ఫాన్స్ మాత్రం ఆ 50  కోట్ల బడ్జెట్ కి కళ్ళు తేలేస్తున్నారు. 

Radhe Shyam climax shocking revelation

Radhe Shyam climax shot lavishly
radhe shyam climax
radhe shyam pan india film
prabhas radhe shyam
pooja hegde radhe shyam
radhakrishna radhe shyam movie
uv creations radhe shyam
radhe shyam movie
radhe shyam update