Advertisementt

బిగ్ బాస్ 5: నాకూ సీక్రెట్ టాస్క్ ఇవ్వండి

Wed 20th Oct 2021 08:08 PM
bigg boss 5,bigg boss telugu,bigg boss,bigg boss today promo highlights,shanmukh,siri,jessy  బిగ్ బాస్ 5: నాకూ సీక్రెట్ టాస్క్ ఇవ్వండి
Bigg Boss 5: today promo highlights బిగ్ బాస్ 5: నాకూ సీక్రెట్ టాస్క్ ఇవ్వండి
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ జరుగుతుంది. ఈ వారం కెప్టెన్ గా ఎవరు అవుతారో కానీ.. ప్రియా కి సన్నీ కి మధ్యన పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటుంది. ప్రియా చంప పగులుతుంది అంటే.. సన్నీ నోరు జాగ్రత్త.. చేతకాని వాళ్ళు మీరు అంటూ ప్రియని వేలుతో బెదిరించడం అన్నీ ఈ రోజు ఎపిసోడ్ లో హైలెట్ కానున్నాయి. ఇక రాత్రి పూట సన్నీ కోడు గుడ్లు కొట్టేసి మానస్ కి ఇస్తాడు. జెస్సిని బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ కి పిలిచి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. దానితో జెస్సి సన్నీ తో గొడవ పడుతుంటే.. అరే వదిలేయ్ రా అని సన్నీ ని అంటే.. అరేయ్ ఒరేయ్ అనకు.. నువ్వు ఆ అర్హత కోల్పోయావ్ అంటూ సన్నీ సిరిపై ఫైర్ అయ్యాడు. జెస్సి కూడా రెచ్చిపోయాడు. రవి కెప్టెన్ అవ్వడానికి సిరి తో బేరం మాట్లాడుతున్నాడు. ఇక షణ్ముఖ్ - సిరి - జెస్సిలు ఎప్పటిలాగే కూర్చుని మాట్లాడుకుంటారు. 

రవి కి ఇచ్చావా అని షన్ను అనగా.. రిలాక్స్ అంటూ సిరి ఇంకో పది ఎమన్నా ఇస్తాను రవికి అంటుంది. జెస్సి నీకు ఎండ్ అఫ్ ద డే షాకవుతారు అంటే.. సిరి కూడా ఇక అవన్నీ వదిలేయ్ ఆంటుంది. అరే మీరేంట్రా బ్రహ్మ కే షాకా.. అని షన్ను అంటే..  ఎప్పుడూ బ్రహ్మె ప్లాన్ చేస్తాడా.. మేము ఈసారి బ్రహ్మ కి సర్ ప్రైజ్ ఇద్దామని అంటుంది. ఇక బిగ్ బాస్ అందరిని కూర్చోబెట్టి ఓ సీక్రెట్ టాస్క్ ని జెస్సికి ఇవ్వడం జరిగింది అనగానే.. షణ్ముఖ్ బిగ్ బాస్ నాక్కూడా అప్పుడప్పుడు సీక్రెట్ టాస్క్ ఇవ్వండి అనగానే.. రవి అరే నువ్వు ముందు టాస్క్ బాగా ఆడు అంటాడు దానితో షన్ను షాకవుతాడు. ఇక బెస్ట్ ఫ్రెండ్స్ అయిన షణ్ముఖ్, సిరి, జెస్సి మధ్యలో చిన్నపాటి గొడవ జరిగింది. ఇదే ఈ రోజు ప్రమోలో హైలైట్స్. 

Bigg Boss 5: today promo highlights :

Bigg Boss 5: today promo goes viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ