Advertisementt

ఆర్యన్ ఖాన్ కి మరోసారి ఎదురు దెబ్బ

Wed 20th Oct 2021 05:26 PM
bail plea rejected,aryan khan,lawyer moves,bombay high court  ఆర్యన్ ఖాన్ కి మరోసారి ఎదురు దెబ్బ
Mumbai court rejects Aryan Khan bail plea ఆర్యన్ ఖాన్ కి మరోసారి ఎదురు దెబ్బ
Advertisement
Ads by CJ

షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కి అడుగడుగునా ఎదురు దెబ్బలే. డ్రగ్స్ కేసులో ముంబై లోని క్రూయిజ్ షిప్ లో ఎన్సీబీ అధికారులకి అడ్డంగా దొరికిపోయిన ఆర్యన్ ఖాన్ కి బెయిల్ తెప్పించడానికి షారుఖ్ ఖాన్ శతవిధాలా తన లాయర్లతో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే రెండు సార్లు ఆర్యన్ ఖాన్ కి ముంబై కోర్టు బెయిల్ నిరాకరించింది. ఆర్యన్ ఖాన్ కి బెయిల్ ఇస్తే.. సాక్ష్యాలను తారు మారు చేసే అవకాశం ఉంది అంటూ ఎన్సీబీ ఆర్యన్ ఖాన్ బెయిల్ కి అడుగడుగునా అడ్డం పడుతుంది. ఇప్పటికే జ్యుడిషియల్ కష్టడీలో సాధారణ జైలు జీవితం అనుభవిస్తున్నాడు ఆర్యన్ ఖాన్.

దానితో ఆర్యన్ ఖాన్ తల్లి గౌరీ ఖాన్, షారుఖ్ ఖాన్ లు కొడుకు జైల్లో ఉండడం చూసి కుంగిపోతున్నారు. ఇక ఈ రోజు కూడా ఆర్యన్ ఖాన్ బెయిల్ పై కోర్టులో వాదనలు జరిగాయి. కానీ మూడోసారి కూడా ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ ని కోర్టు కొట్టివేసింది. ఆర్యన్ వద్ద డ్రగ్స్ దొరకలేదని ఆయన తరపు న్యాయవాదులు చేసిన వాదనను కోర్టు పట్టించుకోలేదు. ఇక రేపటి వరకు ఆర్యన్ ను జ్యుడీషియల్ కస్టడీ ని కోర్టు పొడిగించింది. దానితో షారుఖ్ కుటుంబం తీవ్ర విచారంలో మునిగిపోయింది.

Mumbai court rejects Aryan Khan bail plea:

Bail plea rejected, Aryan Khan lawyer moves Bombay High court

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ