Advertisementt

బిగ్ బాస్ 5: ప్రియా vs సన్నీ

Wed 20th Oct 2021 12:31 PM
bigg boss 5,bigg boss 5 telugu,sunny vs priya,ravi,manas  బిగ్ బాస్ 5: ప్రియా vs సన్నీ
Bigg Boss 5: Sunny vs Priya బిగ్ బాస్ 5: ప్రియా vs సన్నీ
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ హౌస్ ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కోసం రచ్చ రచ్చ జరుగుతుంది.. కోడి గుడ్లు పట్టుకునే క్రమంలో హౌస్ మేట్స్ మధ్యన ఘర్షణ మొదలైంది. అందులోనూ నామినేషన్స్ అప్పటినుండి ప్రియా vs సన్నీ అన్నట్టుగా ఉంది హౌస్ లోని వ్యవహారం. అదే నామినేషన్స్ గొడవని.. కెప్టెన్సీ టాస్క్ లోను కొనసాగిస్తున్నారు వాళ్ళు. నిన్నటి ఎపిసోడ్ లో ప్రియా.. సన్నీ గుడ్లు దొబ్బేస్తాను అంటూ హడావిడి చేసింది. తన దగ్గర ఉన్న గుడ్లు అన్ని మానస్ కి ఇచ్చేసింది. సన్నీ ని రెచ్చగొడుతూ ప్రియా అల్లరల్లరి చేసింది. అదే కెప్టెన్సీ టాస్క్ ఈ రోజు కూడా కంటిన్యూ అయ్యింది. మళ్ళీ బజర్ మోగగానే అందరూ కోడి పెట్ట ప్రభావతి దగ్గరికి వచ్చి కోడి గుడ్లు పెట్టుకుంటారు.

ఈలోపు ప్రియా నాకు బుట్ట దొరికింది అని సన్నీ బుట్టదగ్గరికి వెళ్ళగానే సన్నీ పరిగెత్తుకుంటూ వచ్చి ప్రియని తోసేసాడు. దానితో ప్రియా మాన్ హ్యాండీలింగ్ చేస్తే చెంప పగులుద్ది అని సన్నీకి వార్నింగ్ ఇస్తుంది. నా బుట్ట జోలికి వస్తే ఊరుకోను, అయినా చెంప పగులుతుంది అని అంటారేమిటి అని వేలు చూపిస్తాడు సన్నీ. వేలు చూపిస్తే చెంప పగల గొడతాను అని ప్రియా మళ్ళీ సన్నీ ని రెచ్చగొట్టింది. చేతగాని వాళ్ళు వచ్చేస్తారు హౌస్ కి అని సన్నీ అంటే.. ప్రియా మరోసారి అలాంటి మాటలు మాట్లాడితే.. ఊరుకోను చెంప పగులుతుంది అని గొడవ పడ్డారు. సన్నీ ని ప్రియని హౌస్ మేట్స్ ఎంతగా కంట్రోల్ చేసినా.. వాళ్లిద్దరి మధ్యన గొడవ సద్దుమణగలేదు. 

 

Bigg Boss 5: Sunny vs Priya:

Bigg Boss 5 new promo viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ