Advertisementt

మోహన్ బాబు పై కేసు నమోదు

Tue 19th Oct 2021 06:59 PM
manchu mohan babu,police case,registered,mohan babu,maa elections,press meet  మోహన్ బాబు పై కేసు నమోదు
Police case against Mohan Babu మోహన్ బాబు పై కేసు నమోదు
Advertisement
Ads by CJ

మంచు మోహన్ బాబు అంటే ఫైర్. మా ఎన్నికల్లో మోహన్ బాబు హడావిడి చూసాం.. కన్న కొడుకుని గెలిపించుకోవడానికి మోహన్ బాబు చెయ్యని ప్రయత్నం లేదు. మా ఎలక్షన్స్ టైం లో ప్రత్యర్థుల్ని బెదిరించారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక మెగా ఫ్యామిలీ తో పోటీ పడి మోహన్ బాబు విష్ణు ని గెలిపించారు. అయితే మా ఎన్నికలు ముగిసాయి. మంచు విష్ణు అధ్యక్షుడయ్యాడు. కానీ.. మా ఎన్నికల వేడి తగ్గలేదు. తాజాగా మోహన్ బాబు పై  గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పోలీసులకు  ఫిర్యాదు చేసారు.

ఎందుకంటే మా ఎన్నికలు పూర్తయిన తర్వాత మోహన్ బాబు మట్లాడుతూ.. ప్రతి ఒక్కరి చేతిలోనూ సెల్ ఫోన్ ఉంటుంది అని, ఆఖరికి గొర్రెల కాచుకునే వాడి దగ్గర కూడా సెల్ ఫోన్ ఉంటుంది. వాడు వెంటనే నొక్కి చూస్తున్నాడు అంటూ మాట్లాడారు. ఇప్పుడదే కాంట్రవర్సీ అయ్యింది. తమ మనోభావాలను దెబ్బ తీసేలా మంచు మోహన్ బాబు మాట్లాడారని.. వెంటనే ఆయనపై కేసు పెట్టి అరెస్ట్ చేయాలంటూ గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం నేతలు పోలీసులను ఆశ్రయించారు. వారి నుండి మోహన్ బాబు ని వెంటనే వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్స్ కూడా మొదలైయ్యాయి.

Police case against Mohan Babu:

Police case registered against Mohan babu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ