Advertisementt

సంగీతమే నా ఒత్తిడి తగ్గించే థెరపీ: పూజ

Tue 19th Oct 2021 06:33 PM
pooja hegde,pooja hegde latest click,pooja hegde chit chat with fans  సంగీతమే నా ఒత్తిడి తగ్గించే థెరపీ: పూజ
Pooja Hegde chit chat with fans సంగీతమే నా ఒత్తిడి తగ్గించే థెరపీ: పూజ
Advertisement
Ads by CJ

బుట్టబొమ్మ పూజ హెగ్డే ఈ మధ్యనే తన పుట్టినరోజుని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుని తన సినిమాల షూటింగ్స్ లో బిజీ అయ్యింది. తాజాగా పూజ హెగ్డే అభిమానులతో చేసిన చిట్ చాట్ లో తన సినిమాల ముచ్చట్లు, ఇంకా చాలా విషయాలను అభిమానులతో పంచుకుంది. పూజ హెగ్డే పుట్టిన రోజు నాడు తాను నటించిన, నటిస్తున్న సినిమాల నుండి లుక్స్ రిలీజ్ చేసి ఫాన్స్ లో ఉత్సాహాన్ని నింపారు. ఇక ఆచార్య లో నీలాంబరి లుక్ ఆ కేరెక్టర్ అంటే చాలా ఇష్టమని చెప్పిన పూజ హెగ్డే వరస సినిమాలో చాలా బిజీగా ఉండడంతో.. షూటింగ్స్ కోసం తక్కువ నిద్రపోతూ తరచూ విమానాలు ఎక్కుతున్నా... పని చెయ్యడం అంటే చాలా ఇష్టం. పని విషయంలో చాలా ఆసక్తితో ఉంటాను..అని చెప్పింది.

ఎప్పుడూ పని చేస్తూ ఉంటే.. తక్కువగా మాట్లాడటం.. ఎక్కువగా పని మీదే కాన్సంట్రేట్ చేస్తాం. ఇక షూటింగ్స్ తో బిజీగా వున్నప్పుడు ఒత్తిడి తగ్గించుకోవడానికి సంగీతం వింటాను. అది ఒత్తిడి తగ్గించే థెరపి అంటుంది పూజ హెగ్డే. మ్యూజిక్ నా బెస్ట్ ఫ్రెండ్ అంటుంది పూజ. మనసులో ఏదీ పెట్టుకోకుండా ఏడవటం కూడా ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇక విజయ్ గురించి బీస్ట్ విషయాలు చెప్పమంటే.. అపుడే కాదు.. విజయ్ గురించి చెప్పాలంటే చాలా ఉంది అంటుంది. రాధేశ్యామ్ గురించి చెప్పమంటే అదొక ఎపిక్ అంటుంది. అయితే చిరంజీవి గారు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ చూసి నన్ను అభినందిస్తూ సందేశం పంపారు. మరింత కష్టపడిన పనిచేయాలని ఉన్న ఆ సందేశం నాలో స్ఫూర్తినింపింది అని ఫాన్స్ తో అన్ని విషయాలను పంచుకుంది.

Pooja Hegde chit chat with fans:

Pooja Hegde Chit Chat

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ