బిగ్ బాస్ హౌస్ లో సోమవారం నామినేషన్స్ హీట్ ఇంకా తగ్గలేదు. సోమవారం రాత్రి నామినేషన్స్ లో సన్నీ వన్ మ్యాన్ ఆర్మీ లా గేమ్ మొత్తం మార్చేసాడు. సన్నీ తనకి కావాల్సిన వాళ్ళని సేవ్ చేసుకుని.. మిగతా హౌస్ మొత్తాన్ని నామినేట్ చేసాడు. అయితే ఆ విషయంలో హౌస్ మేట్స్ మాత్రం.. సన్నీ చేసిన పనిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయంలో నీకు దమ్ముంటే గేమ్ ఆడు సేఫ్ గేమ్ ఆడకు అని ప్రియాంక అంటుంది. మానస్ సన్నీకి క్లాస్ పీకాడు. నీదగ్గర ఉన్న పవర్ తో నీ ఫ్రెండ్ ని కాపాడాలనుకుంటే.. నీకు పడని వాళ్ళని కూడా నామినేట్ చేసుకోవచ్చు కదా.. అందరిని నువ్వు కావాలనే నామినేట్ చేసినట్టుగా ఉంది అని మానస్ అంటే..
దానికి వాళ్ళు ఆడితే గేమ్.. నేను ఆడితే క్రైమా అంటూ సన్నీ మానస్ తో అంటాడు. ఇక మానస్ - సన్నీ ల డిస్కషన్ చూసిన రవి.. వీడు తప్పు ఒప్పుకోడు అని సన్నీని అంటే.. లేదు రవి వీడు తప్పు చేయలేదు, ఫ్రెండ్ కోసం ఫ్రెండ్‌ని సేవ్ చేయడానికి నేను నిన్ను నామినేట్ చేస్తున్నా అంతే అంటూ కాజల్ అనేసరి రవి షాకవుతాడు. ఇక ఈ రోజు కెప్టెన్సీ టాస్క్ లో బంగారు కోడిపెట్ట టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. కోడి గుడ్లు ఎక్కువ ఎవరు సేవ్ చేసుకుంటారో వారు కెప్టెన్సీ టాస్క్ కి అర్హత సాధిస్తారు. ఇక ఒక్కొక్క గుడ్డు కోసం ఈ రోజు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంతా తెగ ఆడేసారు.