బిగ్ బాస్ హౌస్ లో గత రాత్రి నామినేషన్స్ విషయం లో రవి, సిరి, ప్రియాంక, ప్రియా చాలా హర్ట్ అయ్యారు. సిరి తాను నామినేట్ చేసిన మానస్ ని సన్నీ నామినేట్ చెయ్యకుండా సేవ్ చేస్తున్నాడని ఆరోపిస్తే, ప్రియా రవి ని సోఫా పై టవల్ ఆరేసిన కారణంగా నామినేట్ చేసింది. ఇక ప్రియాంక ఇదంతా ఫేక్, అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారంటూ ఫైర్ అయ్యింది. అయితే ఈ నామినేషన్స్ మొత్తమ్ సన్నీ చుట్టూనే తిరిగింది. అంటే కౌ బాయ్ గెటప్ లో సన్నీ, శ్రీరామ్, జెస్సిలు ఓ చోట నిలబడగా.. బిగ్ బాస్ బజార్ మోగగానే.. ఎవరు ముందు బయటకి వస్తే.. వాళ్ళు నామినేట్ అవ్వరు అలాగే.. వేరే వాళ్ళని తన డెసిషన్ మీద నామినేట్ కూడా చెయ్యొచ్చు. అలా సన్నీ వన్ మ్యాన్ షో చేసాడు. అరిటి పండు ఎవరికీ దొరికితే వారు సన్నీ తో వాదిస్తూ ఎదుటి వారిని నామినేట్ చేసినా.. ఫైనల్ గా సన్నీ దే డెసిషన్.
అందులోనే సిరి రెండు సార్లు మానస్ ని నామినేట్ చేసినా.. సన్నీ అది సిల్లీ రీజన్ బలమైన కారణం ఉంటె చెప్పు అన్నాడు. ఇక ప్రియా ఈ విషయంలో సన్నీ తో గొడవపడింది. రవి కూడా వాదించాడు. ఫైనల్ గా తొమ్మిదిమంది నామినేట్ అవడానికి సన్నీ కారణం అయ్యాడు. శ్రీరామ్ చరణ్, జెస్సి లు ఎక్కువగా బయటికి రాని కారణంగా వాళ్ళు నామినేట్ అయ్యారు. ఇక లోబో ఆల్రెడీ నామినేషన్ లో ఉన్నాడు. మానస్ సన్నీ తప్పు చేస్తున్నా చెప్పడం లేదు అని, మానస్ చెబితే సన్నీ వింటాడని రవి అంటే.. మానస్ సన్నీ విడివిడిగా గేమ్ ఆడితే చూడాలని ఉంది అంటున్నాడు షణ్ముఖ్. సో గత రాత్రి ఆట మొత్తం సన్నీదే అన్నమాట.