సీనియర్స్ లిస్ట్ లోకి చేరాక కోటా శ్రీనివాసరావు కి అనుకోకుండా సినిమా అవకాశాలు తగ్గాయి. వయసు మీద పడడంతో.. సహజంగానే ఆయనకి సినిమా అవకాశాలు తగ్గాయి. కానీ కోటా శ్రీనివాసరావు మాత్రం వేరే భాషల నటులని తీసుకుంటున్న దర్శకనిర్మాతలపై ఎప్పటికప్పుడు ఫైర్ అవుతుంటారు. మా ఎన్నికల విషయంలోనూ ప్రకాష్ రాజ్ నాన్ లోకల్, ప్రకాష్ రాజ్ కి అస్సలు క్రమ శిక్షణ లేదు అంటూ ఫైర్ అయ్యారు. దానికి నాగబాబు లాంటి వారు గట్టిగానె రిప్లై ఇచ్చారు. అయితే తాజాగా కోటా శ్రీనివాసరా రావు జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ని టార్గెట్ చేసారు. అనసూయ సోషల్ మీడియాలోనే కాదు.. బుల్లితెర మీద గ్లామర్ షో విషయంలో ఎక్కడా తగ్గదు.
ఆమె డ్రెస్సింగ్ స్టయిల్ పై నెటిజెన్స్ కామెంట్స్ ని కూడా లెక్క చెయ్యని అనసూయ.. బుల్లి బుల్లి డ్రెస్సు లతో ఇప్పటికి ఎదుటువారికి గట్టి పోటీ ఇస్తుంది. బుల్లితెర మీద, వెండితెర మీద గ్లామర్ షో చేసే అనసూయ ని చూసిన కోటా శ్రీనివాస రావు ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనసూయ మంచి డాన్సర్, అంతేకాదు ఆమె అద్భుత నటి కూడా. అనసూయ నటించిన సినిమాలు చూసాను. కానీ అనసూయ వేసుకునే బట్టలు తనకి నచ్చవు, అనసూయ లాంటి అందమైన అమ్మాయి ఒంటి నిండా బట్టలు వేసుకున్న ఎవరైనా చూస్తారు. కానీ అలా చిట్టిపొట్టి డ్రెస్సులలో ఆమె అంతగా బావుండదు. ఆమె ఎంత మంచి నటి అయినా కూడా తన డ్రెస్సింగ్ స్టైల్ మాత్రం నాకు నచ్చదని చెప్పారు కోట.
అయితే ఆమె మీద గౌరవం ఉంది కాబట్టే డ్రెస్సింగ్ మారిస్తే బావుంటుందని అంటున్నాను.. అంటూ కోటా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక తన డ్రెస్సెస్ విషయంలో నెటిజెన్స్ కి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చే అనసూయ కోటా గారిని ఎందుకు వదిలేస్తుంది. అనసూయ కోటా చేసిన వ్యాఖ్యలపై సీరియస్‌గా రియాక్ట్ అయింది. మా కుటుంబానికి లేని సమస్య మీకేంటో అంటూ కోటాకి ఇచ్చి పడేసింది.