దసరా పండగ స్పెషల్ గా ఈ నెల 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహాసముద్రం మూవీకి సో సో టాక్ వచ్చింది. శర్వానంద్ -సిద్దార్థ్ కలయికలో అజయ్ భూపతి తెరకెక్కించిన మహా సముద్రం ట్రైలర్ తోనే ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది.. ట్రైలర్ చూసిన వాళ్ళు.. సినిమా చూడాలనే కుతూహలంతో థియేటర్స్ కి వెళ్లారు. కానీ అజయ్ భూపతి ట్రైలర్ తో సినిమాపై పెంచిన అంచనాలు అందుకోలేకపోయారు. క్లారిటీ లేని పాత్రలతో సినిమాని తేల్చేసాడు. వీక్ స్క్రీన్ ప్లే తో సినిమా ని తీరాన్ని దాటకుండా చేసాడు. శర్వానంద్ మాత్రం పెరఫార్మెన్స్, లుక్స్ పరంగా అదరగొట్టేసినా సినిమాలో స్టఫ్ లేకపోతె ఎవ్వరూ ఏమి చెయ్యలేరు అనే సామెతని మహా సముద్రం ఉదాహరణ. అయితే సినిమాకి ఎలాంటి టాక్ వచ్చినా.. ఏ సక్సెస్ మీటో, లేదంటే, ఏ థాంక్యూ మీటో పెట్టి సినిమాపై జనాల్లో కాస్త పాజిటివ్ వైబ్స్ కలిగించినట్లయితే.. సినిమాకి మరికాస్త కలెక్షన్స్ వచ్చేవి.
కానీ మహా సముద్రం విడుదలయ్యింది. ఆ సినిమా కి నెగెటివ్ టాక్ వచ్చింది. అంతే మహాసముద్రం సినిమా ఇక చడీ చప్పుడు లేదు. అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా ఓ.. సూపర్ హిట్ టాక్ తెచ్చుకోలేదు. కానీ ఆ సినిమా రిలీజ్ అయ్యాక కూడా సక్సెస్ సెలెబ్రేషన్స్, థాంక్యూ మీట్.. రేపు సక్సెస్ మీట్ అంటూ హడావిడి చేస్తున్నారు. సినిమా వీక్ గా ఉన్నా రిలీజ్ తర్వాత ప్రమోషన్స్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గట్టెక్కేసింది. కానీ మహాసముద్రానికి ప్రమోషన్స్ కూడా వీక్ గానే ఉన్నాయి. పోయిన సినిమాకి మళ్ళీ బ్యాండ్ బాజా ఎందుకు అనుకున్నారేమో మహాసముద్రం మేకర్స్.. అందుకే సైలెంట్ గా ఊరుకుండిపోయారు.