Advertisementt

బిగ్ బాస్ 5: హౌస్ లో నామినేషన్స్ హీట్

Mon 18th Oct 2021 08:24 PM
bigg boss,bigg boss 5,bigg boss 5 telugu,sunny,ravi,priya,kajal  బిగ్ బాస్ 5: హౌస్ లో నామినేషన్స్ హీట్
Bigg Boss 5: 7th Week Nominations heat బిగ్ బాస్ 5: హౌస్ లో నామినేషన్స్ హీట్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ హౌస్ మొత్తం రసాభాసగా మారింది. కారణం మండే.. హౌస్ లో నామినేషన్స్ వేడి. బిగ్ బాస్ హౌస్ లో సోమవారం, అలాగే నాగార్జున వస్తున్న శనివారం ఎపిసోడ్స్ మాత్రమే కిక్ ఇస్తున్నాయి. ఆఖరికి ఆదివారం ఎపిసోడ్ కూడా సోషల్ మీడియాలో ముందే లీకైపోయి క్రేజ్ ని ఆసక్తి ని చంపేస్తుంది. ఇక తాజాగా సోమవారం నామినేషన్స్ లో రవి ని ప్రియా సిల్లీగా నామినేట్ చేసింది. అదేమిటంటే రవి సోఫా మీద టవల్ ఆరెయ్యడం ఇష్టం లేని కారణముగా అతన్ని నామినేట్ చేసింది. దానితో హౌస్ లోని సభ్యులంతా షాక్ అయ్యారు. ప్రియాంక హౌస్ మేట్స్ అంతా ఫేక్ అంటూ చిందులు వేసింది. సేఫ్ గేమ్ ఆడుతున్నారంది. ఇక రవి నేను ఆరువారాలుగా నామినేషన్స్ లో ఉంటున్నా అని సన్నీ ని బ్రతిమాలుతున్నాడు.

శ్వేతా ఉంటే శ్వేతనే నామినేట్ చేసేవాడిని అనగా.. రవి నా వల్లే శ్వేతా ఎలిమినేట్ అయ్యిందా అని సన్నీ ని అడుగుతాడు. ఇక శ్వేతా పేరు తియ్యొద్దు అని అని మాస్టర్ సన్నీకి చెబుతుంది. ఇక సిరి ని కూడా నామినేట్ చేసారు. ఈ సోమవారం నామినేషన్స్ కాక మాములుగా లేదు. సన్నీ అయితే రవి మెడలో ఓ బోర్డు వేసాడు. దానిని లోబో సీక్రెట్ రూమ్ నుండి చూస్తున్నాడు. మరి ఈ వారం దాదాపుగా తొమ్మిదిమంది నామినేషన్స్ లోకి వెళ్ళినట్టుగా టాక్. 

Bigg Boss 5: 7th Week Nominations heat:

Bigg Boss 5 telugu latest promo viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ