Advertisementt

అఖిల్ కోసం రంగంలోకి ఐకాన్ స్టార్

Mon 18th Oct 2021 01:40 PM
icon star,allu arjun,chief guest,most eligible bachelor movie,akhil,most eligible bachelor success meet  అఖిల్ కోసం రంగంలోకి ఐకాన్ స్టార్
Allu Arjun to be the chief guest at the Most Eligible Bachelor Success Meet అఖిల్ కోసం రంగంలోకి ఐకాన్ స్టార్
Advertisement
Ads by CJ

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. దసరా స్పెషల్ గా అక్టోబర్ 15న రిలీజ్ అయ్యింది. డే వన్ నుండి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కి  అద్భుతమైన కలెక్షన్లు వస్తున్నాయి. పండగ సీజన్ ను క్యాష్ చేసుకుని వసూళ్ల వర్షం కురిపిస్తుంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన థాంక్స్ మీట్ నివైజాగ్ లో గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్. ఇప్పుడు హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నారు. 

అయితే అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కోసం ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాబోతున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో వచ్చే సినిమాలకు ఎప్పుడూ అండగా నిలబడడం అల్లు అర్జున్ ప్రత్యేకత. గతంలో చాలా సినిమాలకు ఇదే చేశారు. ఇప్పుడు అదే బ్యానర్ నుండి వచ్చిన అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాకు కూడా తన సపోర్ట్ అందిస్తున్నారు అల్లు అర్జున్. ఇప్పటికే అద్భుతమైన కలెక్షన్స్ తీసుకొచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. ఈ ప్రమోషన్స్ తో వీక్ డేస్ లో కూడా మంచి వసూళ్లు సాధిస్తోందని దర్శక నిర్మాతలు నమ్ముతున్నారు.

Allu Arjun to be the chief guest at the Most Eligible Bachelor Success Meet:

Icon star Allu Arjun to be the chief guest at the Most Eligible Bachelor Success Meet

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ