Advertisementt

అఖిల్ ని ఆదుకున్న పూజ హెగ్డే

Mon 18th Oct 2021 12:03 PM
pooja hegde,akhil akkineni,pooja glamour,most elijibul bachilar movie,most elijibul bachilar hit talk  అఖిల్ ని ఆదుకున్న పూజ హెగ్డే
Pooja Hegde luck works for Akhil film అఖిల్ ని ఆదుకున్న పూజ హెగ్డే
Advertisement
Ads by CJ

అఖిల్ అక్కినేని.. వెండితెరకు పరిచయం అవడం చాలా గ్రాండ్ గానే పరిచయం అయ్యాడు., వి.వి వినాయక్ తో అఖిల్ అనే మాస్ ఎంటర్టైనర్ చేసాడు. ఆ సినిమా డిజాస్టర్ ఇచ్చింది. ఆ తర్వాత విక్రమ్ కుమార్ హలో, తర్వాత వెంకీ అట్లూరి తో మిస్టర్ మజ్ను అంటూ లవర్ బాయ్ తరహా పాత్రల్లో కనిపించిన అఖిల్ కి లక్కు కలిసిరాలేదు. దానితో నాగార్జున కొడుకు కెరీర్ గురించి చాలా టెంక్షన్ పడ్డారు. ఇక అల్లు అరవింద్ చేతిలో అఖిల్ భవిష్యత్తు ని పెట్టి నాగ్ కూల్ అయ్యారు. అఖిల్ సినిమాల విషయంలో కలగజేసుకునే నాగ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విషయంలో ఎక్కడా వేలు పెట్టలేదు.. అరవింద్ మీదే నమ్మకం ఉంచారు. ఇక దసరా సందర్భంగా రిలీజ్ అయిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.

అయితే సినిమాలో ప్లస్ పాయింట్ అనేది పూజ హెగ్డే గ్లామర్. టాప్ హీరోయిన్, పాన్ ఇండియా హీరోయిన్, క్రేజుకి క్రేజు, సినిమాలో పూజ గ్లామర్ సినిమాకి పనికొచ్చాయి. అఖిల్ పెరఫార్మెన్స్ సో సో గా ఉంటే.. బొమమరిల్లు భాస్కర్ ఆ బొమ్మరిల్లు ఫ్లేవర్ ని వదల్లేదు.. కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ చేసాడు. అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గట్టెక్కడానికి 100 శాతం పూజ హెగ్డే నే కారణమంటూ సోషల్ మీడియా కామెంట్స్ ఉన్నాయి. మరి పూజ హెగ్డే ప్లేస్ లో ఎవరు ఉన్నా.. సినిమా తుస్ మనేది అంటున్నారు. విభా గా పూజ స్టాండ్ అప్ కమెడియన్ గా లుక్స్ వైజ్ గా, కేరెక్టర్ వైజ్ గా ఆకట్టుకుంది కాబట్టే అఖిల్ గట్టెక్కాడు.. ఇది సోషల్ మీడియా లో అభిమానుల మాట. 

Pooja Hegde luck works for Akhil film:

Pooja Hegde glamour help for Most Elijibul Bachilar

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ