పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. లైనప్ చూస్తే మాములుగా లేదు. ఆయన చేసే సినిమాల బడ్జెట్ లు, ఆయన తీసుకునే పారితోషకాలే అన్ని భాషల ఇండస్ట్రీ ల్లో హాట్ టాపిక్స్. బాహుబలి ప్రభాస్ లైఫ్ ని మార్చేసింది. దానితో వరసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెడుతున్నాడు ప్రభాస్. రాధేశ్యామ్ జనవరిలో రిలీజ్ కాబోతుంటే.. ఆదిపురుష్ ఆగష్టు 2022 లో రిలీజ్ కాబోతుంది. ఇక సలార్ డేట్ కూడా త్వరలోనే ప్రకటించబోతున్నారు. ఆ తర్వాత నాగ్ అశ్విన్ తో పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కె కి రెడీ కాబోతున్నాడు. అన్ని మూవీస్ షూటింగ్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతాయో తెలియదు కానీ.. సందీప్ రెడ్డి వంగా తో స్పిరిట్ మూవీ ప్రకటించి షాకిచ్చాడు.
ఇక ఇన్ని అప్ డేట్స్ తో ప్రభాస్ ఫాన్స్ కి ఊపిరి ఆడడం లేదు. ఇక ప్రభాస్ బర్త్ డే రాబోతుంది. మరో ఐదు రోజుల్లో ప్రభాస్ పుట్టిన రోజు. ఆ రోజు ప్రభాస్ చేస్తున్న మూవీస్ నుండి ప్రభాస్ సినిమా పోస్టర్స్, ప్రభాస్ సినిమాల అప్ డేట్స్ తో సోషల్ మీడియాని షేక్ చేసేందుకు ప్రభాస్ ఫాన్స్ రెడీ అవుతున్నారు. ప్రభాస్ నుండి మెనీ అప్ డేట్స్ అంటూ ఆయన పిఆర్ టీం.. ప్రభాస్ పుట్టిన రోజున వచ్చే అప్ డేట్స్ పై ట్వీట్ చేసేసరికి ఫాన్స్ లో ఉత్సాహం ఉరకలు వేస్తుంది. మరి ప్రభాస్ సినిమాల పోస్టర్స్, ఫస్ట్ లుక్స్, రిలీజ్ డేట్స్, టీజర్.. ఇలా ప్రభాస్ పుట్టిన రోజున ఎంత హడావిడి ఉండబోతుందో మరి.