Advertisementt

మెగా ఫాన్స్ ని డిస్పాయింట్ చేసిన రామ్ చరణ్

Sun 17th Oct 2021 03:41 PM
ram charan,prashanth neel,chiranjeevi,rc 17,dvv danayya,chiranjeevi  మెగా ఫాన్స్ ని డిస్పాయింట్ చేసిన రామ్ చరణ్
Ram Charan disappoints mega fans మెగా ఫాన్స్ ని డిస్పాయింట్ చేసిన రామ్ చరణ్
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ లైనప్ మాములుగా లేదు. ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అయిన కేవలం నెల రోజుల్లోనే తండ్రి ఆచార్య తో కలసి మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రామ్ చరణ్... ఆ సినిమా తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ తో మూడు భాషల్లో సినిమాని మొదలు పెట్టాడు. పూజా కార్యక్రమాలతో మొదలైన RC15 రెగ్యులర్ షూట్ కూడా త్వరలోనే మొదలు కాబోతుంది. భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ మూవీని తెరకెక్కిస్తుండగా.. తన తదుపరి మూవీ RC16 ని జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో చెయ్యబోతున్నట్టుగా రామ్ చరణ్ దసరా స్పెషల్ గా ప్రకటించాడు. అదే రోజు రామ్ చరణ్ - చిరంజీవి - డివివి దానయ్యలతో కన్నడ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ త్రో ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చెయ్యగానే.. RC17 ప్రశాంత్ నీల్ - రామ్ చరణ్ కాంబో అని అందరూ ఫిక్స్ అయ్యారు.

రామ్ చరణ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో దానయ్య భారీ బడ్జెట్ తో RC17 నిర్మించబోతున్నాడనే న్యూస్ నడిచింది. దానితో రామ్ చరణ్ లైనప్ చూసి మెగా ఫాన్స్ ఖుషి అయ్యారు.  కానీ రామ్ చరణ్ మెగా ఫాన్స్ ని బాగా డిస్పాయింట్ చేసాడు. అంటే నిన్న జరిగిన ఓఈవెంట్ లో పాల్గొన్న రామ్ చరణ్ ప్రశాంత్ నీల్ ని జస్ట్ కలిసాను.. అంతేకాని ఆయనతో సినిమా కోసం మాత్రం కాదు.. ఫ్యూచర్ లో ప్రశాంత్ నీల్ తో సినిమా చేసే అవకాశం ఉండొచ్చు.. అంటే ఇప్పడు కాదు అంటూ చెప్పడంతో మెగా ఫాన్స్ డిస్పాయింట్ అవుతున్నారు. ప్రశాంత్ నీల్ సలార్, NTR31 తర్వాత రామ్ చరణ్ తో మూవీ చేస్తాడేమో అని ఆశ పడ్డారు.

Ram Charan disappoints mega fans:

Ram Charan ends speculation over Prashanth Neel project

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ