Advertisementt

అక్కడ ట్రెడిషన్ - ఇక్కడ గ్లామర్

Sun 17th Oct 2021 12:48 PM
keerti suresh,keerty suresh,keerthi glamour and traditional look,keerthi suresh birth day special,keerthi suresh special  అక్కడ ట్రెడిషన్ - ఇక్కడ గ్లామర్
Keerthi Suresh Birthday Special అక్కడ ట్రెడిషన్ - ఇక్కడ గ్లామర్
Advertisement
Ads by CJ

కీర్తి సురేష్ ఇప్పుడు చేతినిండా సినిమాలతో కళకళలాడుతుంది. మహేష్ బాబు తో సర్కారు వారి పాట, నాని తో రీసెంట్ గా దసరా, ఇంకా చిరు తో కలిసి భోళా శంకర్ లో సిస్టర్ కేరెక్టర్ లో నటిస్తుంది. అంతేకాకుండా కీర్తి సురేష్ నటించిన గుడ్ లక్ సఖి ప్రేక్షకుల ముందు రావాల్సి ఉంది. ఇక నేడు కీర్తి సురేష్ పుట్టిన రోజు. కీర్తి సురేష్ కి బర్త్ డే విషెస్ తెలుపుతూ ఆమె నటిస్తున్న సినిమాల నుండి కీర్తి సురేష్ స్పెషల్ పోస్టర్స్ రిలీజ్ చేసారు. సర్కారు వారి పాటలో మహేష్ కి జోడిగా కీర్తి సురేష్ గ్లామర్ లుక్ లో కనిపిస్తుంది. సర్కారు వారి పాట నుండి కీర్తి సురేష్ గ్లామర్ లుక్ తో ఆమెకి బర్త్ విషెస్ తెలియజేసింది టీం.

ఇక చిరు - మెహెర్ రమేష్ భోళా శంకర్ లో కీర్తి సురేష్ చిరుకి చెల్లెలిగా నటించబోతుంది. భోళా శంకర్ నుండి కీర్తి సురేష్ ట్రెడిషనల్ లుక్ పోస్టర్ తో ఆమెకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసింది. అక్కడ సర్కారు వారి పాటలో గ్లామర్ గా కనిపిస్తున్న కీర్తి సురేష్.. ఇక్కడ భోళా శంకర్ లో ట్రెడిషనల్ గా కనిపించబోతుంది. ఇక గుడ్ లక్ సఖి నవంబర్ లో థియేటర్స్ లోకి రాబోతుంది అని, నాని - కీర్తి సురేష్ కాంబో దసరా మూవీ నుండి కీర్తి సురేష్ కి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ పోస్టర్స్ రిలీజ్ చేసారు. మరి నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న కీర్తి సురేష్ కి సినీజోష్ టీం తరుపున ఏ వెరీ హ్యాపీ బర్త్ డే.

Keerthi Suresh Birthday Special :

Glamour and Traditional Keerthi Suresh

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ