Advertisementt

బిగ్ బాస్ 5: ఈ రోజు ఎలిమినేట్ అయ్యింది..

Sun 17th Oct 2021 11:15 AM
bigg boss 5,swetha varma,bigg boss eliminated,swetha varma eliminated  బిగ్ బాస్ 5: ఈ రోజు ఎలిమినేట్ అయ్యింది..
Bigg Boss 5: Swetha to be eliminated బిగ్ బాస్ 5: ఈ రోజు ఎలిమినేట్ అయ్యింది..
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 ఆరోవరం ముగించుకుని ఏడో వారంలోకి అడుగుపెట్టింది. ఇక ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి లోబో, ప్రియలలో ఒకరిని ఎలిమినేట్ చేయబోతున్నట్లుగా నాగార్జున గత రాత్రి బిల్డప్ ఇచ్చి మరీ.. లోబో ని సీక్రెట్ ర్రూమ్ కి పంపించారు. అసలు లోబో ఎలిమినేట్ అయ్యాడనుకుని హౌస్ లోని సభ్యులంతా కంగారు పడుతున్నారు. ఇక నేడు ఎలిమినేషన్స్ లో ఉన్న పది మందిలో లోబో సీక్రెట్ రూమ్ కి వెళ్లగా.. ఈ రోజు తొమ్మిది మంది నుండి ఒకరిని ఎలిమినేట్ చెయ్యబోతున్నారు. నిన్నటివరకు లోబో, విశ్వ, ప్రియాంకలు డేంజర్ జోన్ లో ఉన్నప్పటికీ.. అనూహ్యంగా ఈ రోజు హౌస్ నుండి అనుకోని కంటెస్టెంట్ బయటికి వెళ్ళింది.

ఆమె శ్వేతా. బిగ్ బాస్ గేమ్ ని జెన్యూన్ గా ఆడుతున్న శ్వేతా ఈ వారం ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ ని వీడింది. ఆని మాస్టర్ తో బాండింగ్ పెట్టుకున్న శ్వేతా.. ఈ వారం రవి చేసిన పని వలన వరెస్ట్ పెరఫార్మెర్ గా జైలు కి వెళ్ళింది. అయితే లోబో సీక్రెట్ రూమ్ కి వెళ్లడం వలన అనూహ్యంగా శ్వేతా ఎలిమినేట్ అయ్యింది అని.. లేదంటే శ్వేతా ఎలిమినేట్ అయ్యేది కాదంటున్నారు. ఇక ఈ వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ పేరు ఈ రోజు రాత్రికి బయటకి రావాల్సింది.. కానీ నిన్న రాత్రే శ్వేతా పేరు లీకై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

Bigg Boss 5: Swetha to be eliminated:

Bigg Boss 5: Swetha to be eliminated on the 6th week

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ