యంగ్ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో కి హోస్ట్ గా అదరగొట్టేస్తున్నాడు. ఎన్టీఆర్ పెరఫార్మెన్స్, ఎన్టీఆర్ స్టయిల్, ఎన్టీఆర్ వాక్చాతుర్యం అన్ని ఎవరు మీలో కోటీశ్వరులు షో కి ప్లస్ పాయింట్స్. ఆ షో కి హైప్ తెచ్చేందుకు ఎన్టీఆర్ శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వచ్చే కంటెస్టెంట్స్ ఎన్టీఆర్ భజన వల్ల షో కి రేటింగ్ తగ్గడం.. ఈ షో అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించలేకపోవడం.. లైక్ సీరియల్స్ చూసే వారు, ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి ఈ షో అంతగా రీచ్ అవ్వడం లేదు. అందుకే ఈ షో కి మరింత కలర్ ఫుల్ క్రేజ్ తేవాలని అప్పుడప్పుడు గెస్ట్ లుగా సెలబ్రిటీస్ ని తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఓపెనింగ్ ఎపిసోడ్ కి రామ్ చరణ్, తర్వాత జక్కన్న, మొన్న దసరా స్పెషల్ గా సమంత వచ్చారు.. ఆ ఎపిసోడ్స్ అన్ని బుల్లితెర ప్రేక్షకులు కి బాగా ఎక్కేశాయి.
ఇక నెక్స్ట్ అంటే సమంత తర్వాత ఎవరు మీలో కోటీశ్వరులు షో కి మరో ఇద్దరు గెస్ట్ లు రాబోతున్నారు. వారే టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎస్.ఎస్. థమన్ అండ్ దేవిశ్రీ ప్రసాద్ లు ఎన్టీఆర్ షో కి రాబోతున్నారు. ఇద్దరూ ఎన్టీఆర్, దేవిశ్రీ లు సూపర్ హిట్ ఇచ్చినవాళ్ళే. మరి సమంత ఎపిసోడ్ ఎంతగా హైలెట్ అయ్యిదో.. ఈ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఎన్టీఆర్ తో కలిసి ఎంతగా అల్లరి చేస్తారో.. అని ఇప్పటి నుండే ఫాన్స్ లో ఆసక్తి పెరిగిపోతుంది. మరి దేవిశ్రీ, థమన్ లు ఎన్టీఆర్ తో కలిసి ఎలా ఆడతారో చూడాలి.