Advertisementt

మంచు విష్ణు కి హ్యాండ్ ఇచ్చిన బాలయ్య

Sat 16th Oct 2021 02:19 PM
manchu vishnu,maa president,mohan babu,naresh,talasani  మంచు విష్ణు కి హ్యాండ్ ఇచ్చిన బాలయ్య
Manchu Vishnu takes oath as MAA president మంచు విష్ణు కి హ్యాండ్ ఇచ్చిన బాలయ్య
Advertisement
Ads by CJ

మా అధ్యక్షుడిగా గెలిచాక తనకి సపోర్ట్ చేసిన వారి దగ్గరకి వెళ్లి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాడు మంచు విష్ణు. ముందు నుండి ఇండస్ట్రీ పెద్దల సపోర్ట్ తో ప్రకాష్ రాజ్ పై  గెలుపొందిన మంచు విష్ణు నేడు మా అధ్యక్షుడిగా ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో ప్రమాణ స్వీకారం చేసాడు. ఈ ప్రమాణ స్వీకారానికి మంచు ప్యానల్ సభ్యులు, మోహన్ బాబు, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని హాజరయ్యారు. అయితే మా ఎన్నికల్లో మంచు విష్ణు ని సపోర్ట్ చేసిన బాలకృష్ణ ని మంచు విష్ణు గెలిచిన తర్వాత తండ్రితో కలిసి వెళ్లి థాంక్స్ చెప్పి.. ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. ఇక మెగా ఫ్యామిలీతో ఉన్న ఇస్స్యూస్ వలన చిరు ని మోహన్ బాబు ఆహ్వానించలేదు.

అయితే ఈ రోజు విష్ణు ప్రమాణ స్వీకార మహోత్సవానికి బాలకృష్ణ హాజరవలేదు. అంతేకాదు.. మా ఎన్నికల్లో ఓడిపోయిన ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు కానీ, ప్రకాష్ రాజ్ కానీ.. విష్ణు ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. బాలయ్య ఎందుకు రాలేదో కానీ.. ఇప్పుడు మీడియాలో ఇదే హాట్ టాపిక్ అయ్యింది. ఇక చిరు కి మోహన్ బాబు కౌంటర్ వేశారు.. మా అధ్యక్ష పదవి చిన్నది అని చిరు ఓ ఈవెంట్ లో మట్లాడడంపై మోహన్ బాబు స్పందిస్తూ.. రాజకీయాలకన్నా, ఇండస్ట్రీలో పాలిటిక్స్ ఎక్కువయ్యాయని, మా అధ్యక్ష పీఠం చిన్న పదవి కాదు.. చాలా బాధ్యలతలు ఉన్నాయి.. మా అధ్యక్షుడిగా విష్ణు ముందు చాలా ఛాలెంజ్ లు ఉన్నాయంటూ మోహ బాబు మాట్లాడారు. ఇక తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ మంచు విష్ణు మా ఎన్నికల్లో గెలుస్తాడని ఎన్నికలన్న ముందే అంటే పది రోజుల ముందే తెలుసు అని.. తెలంగాణ ప్రబుత్వం మా అధ్యక్షుడు మంచు విష్ణు కి తోడుగా ఉంటుంది అని అన్నారు. 

Manchu Vishnu takes oath as MAA president:

Manchu Vishnu as MAA president to take oath today

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ