నిన్న దసరా పండుగ సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీ కళకళలాడింది. దసరా ఫెస్టివల్ సందర్భంగా సినిమాల రిలీజ్ లు, సినిమాల ఓపెనింగ్స్, సినిమాల ఫస్ట్ లుక్స్, దసరా స్పెషల్ పోస్టర్స్, రిలీజ్ డేట్స్ అనౌన్సమెంట్స్, సినిమా అప్ డేట్స్, సినిమాల అధికారిక ప్రకటనలు.. అబ్బో ఒకటేమిటి అసలు టాలీవుడ్ కి దసరా కళ వచ్చేసింది అనేలా ఉంది హడావిడి. ఇంత హడావిడిలో యంగ్ హీరోల సినిమాల అప్ డేట్స్ హైలెట్ అయ్యాయి. కానీ స్టార్ హీరోల హడావిడి మచ్చుకైనా కనిపించలేదు. పాన్ ఇండియా మూవీస్ హడావిడి అస్సలే లేదు. రాధేశ్యామ్, పుష్ప, ఆర్.ఆర్.ఆర్, లైగర్ ఇలా పాన్ ఇండియా మూవీస్ ఏది తమ సినిమాల నుండి జస్ట్ పోస్టర్ కూడా వదల్లేదు.
అవి సరే.. టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ మూవీస్ అయిన బాలకృష్ణ అఖండ మూవీ నుండి ఎలాంటి అప్ డేట్ లేదు. కనీసం బాలయ్య అఖండ నుండి దసరా శుభాకాంక్షలు పోస్టర్ కూడా లేదు. ఇక చిరు ఆచార్య ఫిబ్రవరి 4 న రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా నుండి కూడా పోస్టర్ ఇవ్వలేదు. మహేష్ సర్కారు వారి పాట నుండి కనీసం పోస్టర్ ఇవ్వలేదు. ఇలా చాలామంది దసరా పండగని పెద్దగా పట్టించుకున్నట్లుగా కనిపించలేదు.. పండగ రోజున ఫాన్స్ అంతా తమ హీరోల అప్ డేట్స్ కోసం ఎదురు చూస్తారు. కనీసం పోస్టర్స్ ఇచ్చిన దానితో పండగ చేసుకుంటారు. కానీ కొంతమంది హీరోల ఫాన్స్ కాస్త డిస్పాయింట్ అయ్యారు.