నాగ చైతన్య తో విడిపోయాక సమంత సోషల్ మీడియాలో యాక్టీవ్ గానే ఉంది. అయితే సమంత చైతు తో విడిపోయాక చాలా సఫర్ అయ్యింది. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో సమంత పై ట్రోల్ జరగడంతో కన్నీరు మున్నీరు అయిన సమంత తాజాగా ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో కి హాజరైంది. ఇక సమంత దసరా కి ఓ స్పెషల్ న్యూస్ ఇవ్వబోతుంది.. కొత్త సినిమాల ప్రకటన ఉండబోతుంది అంటూ ప్రచారం జరిగినట్టుగానే సమంత నాగ చైతన్య తో విడాకులకన్నా ముందే శాకుంతలం పాన్ ఇండియా మూవీ షూటింగ్ కంప్లీట్ చేసింది. ఇక విడాకుల తర్వాత సమంత ఫాన్స్ కి సర్ ప్రైజ్ ఇస్తూ.. బై లింగువల్ మూవీకి ఒకే చెప్పింది.
దసరా స్పెషల్ గా సమంత తెలుగు, తమిళ మూవీని మేకర్స్ ప్రకటించారు. ఖైదీ సినిమా నిర్మాత ప్రకాష్ బాబు - ప్రభులు లు డ్రీం వారియర్ పిక్చర్స్ బ్యానర్ లో.. కొత్త దర్శకుడితో సమంత ఈ బైలింగువల్ మూవీ చేస్తుంది. నాగ్ చైతన్య తో డివోర్స్ తర్వాత సమంత నిజంగానే సర్ ప్రైజ్ చేసింది. మళ్ళీ కెరీర్ లో బిజీ కాబోతుంది. శాకుంతలం సమయంలో సమంత ఫ్యామిలీ ప్లానింగ్ లో ఉన్నాను అంది. కానీ చైతు తో విడిపోయాక ఫ్యామిలీతో పని లేదు.. ఆ బాధని మరిచిపోవడానికి ఇలా పని మీద కాన్సంట్రేట్ చేస్తుంది.. అందుకే నువ్ సూపర్ సామ్ అనేది.