Advertisementt

మహానటి సమంత: ఎన్టీఆర్

Wed 08th Dec 2021 06:45 PM
ntr,samantha,evaru meelo koteeswarulu show,ntr- samantha evaru meelo koteeswarulu show highlights,ntr- samantha  మహానటి సమంత: ఎన్టీఆర్
NTR- Samantha Evaru Meelo Koteeswarulu Show highlights మహానటి సమంత: ఎన్టీఆర్
Advertisement
Ads by CJ

అందం ఎంత ఇంపార్టెంటో.. అణుకువ అంత ఇంపార్టెంట్, పెరఫార్మెన్స్ ఎంత ఇంపార్టెంటో.. కేరెక్టర్ అంత ఇంపార్టెంట్ ఇవన్నీ నీలో ఉన్నవి.. అప్పట్లో మహానటి సావిత్రి అయితే.. ఇప్పుడు మహానటి సమంత ఈమాటాలన్నది ఎవరో కాదు.. ఎవరు మీలో కోటీశ్వరులు షో హోస్ట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఎప్పటికి సమంత మహానటి లా అల్లరి పిల్లగానే నవ్వుతూ ఉండాలంటూ షో లో సమంత కి చెప్పాడు. సమంత ని మహానటి సావిత్రితో పోల్చాడు. మరి సావిత్రి పర్సనల్ లైఫ్ ని సమంత పర్సనల్ లైఫ్ తో ముడిపెట్టాడో లేదో కానీ.. ఎన్టీఆర్ అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిన్న రాత్రి దసరా స్పెషల్ ఎపిసోడ్ కి గెస్ట్ గా వచ్చిన సమంత ని ఓ ఆటాడుకున్నాడు. 

సమంత ని జిమ్ కి సంబందించి ప్రశ్న అడిగిన ఎన్టీఆర్ అప్పుడెప్పుడో నువ్వు రోప్ పట్టుకుని యోగ లాంటిది చేసావ్.. ఇప్పుడు చేస్తున్నావా అంటే సమంత.. ఇప్పుడు చెయ్యడం లేదు.. నడుం పట్టేసింది అంటూ ఫన్నీ గా సమాధానం చెప్పింది. ఇక నువ్వు ఇంత సన్నగా ఉన్నావ్ అంటే గాలి తిని బ్రతుకుతున్నావా అని ఎన్టీఆర్ అనగా.. కాదండి బాగానే తింటాను.. కాకపోతే ఫిట్ గా ఉంటాను అని చెప్పింది. ఇక నేను కూడా ఎవరు మీలో కోటీశ్వరులు షో కి ఓ ఛాయస్ అవ్వొచ్చని సమంత అనగానే.. అవ్వండి.. ఇప్పుడు నెక్స్ట్ సీజన్ కి సమంత హోస్ట్ అని అనౌన్స్ చేస్తాను అంటూ ఎన్టీఆర్ అనగా.. ప్లీజ్ ఆపండి. అప్పుడు మీ ఫాన్స్ చేతిలో అంటూ సమంత కామెడీ చేసింది. మీ ఫాన్స్ అనగానే ఎన్టీఆర్ మా ఫాన్స్ బంగారాలండి అంటాడు. అవునండి నిజంగానే మీ ఫాన్స్ బంగారం అంటూ వెటకారమాడింది సామ్.. సో సమంత - ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో ని ఫన్నీ గా మార్చేసారు. 

NTR- Samantha Evaru Meelo Koteeswarulu Show highlights:

Mahanati is Samantha says NTR

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ