దసరా సందర్భంగా ఎన్టీఆర్ హోస్ట్ లో వస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో కి టాప్ హీరోయిన్ సమంత గెస్ట్ గా వచ్చింది. నాగ చైతన్య తో విడాకులు తీసుకున్నాక సమంత ఫస్ట్ టైం ఓ షో కి హాజరవడం కానీ, మీడియా ముందు కనిపించడం కానీ.. అందుకే గత వారం రోజులుగా ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు సమంత ఎపిసోడ్ పైనే అందరి చూపు, ఆసక్తి. ఎందుకంటే సమంత ఆ షో లో ఏం మాట్లాడుతుందో.. ఎలాంటి ఎక్సప్రెషన్స్ ఇస్తుందో.. ఎప్పుడూ హుషారుగా ఉండే సమంత ఎలా ఉంటుందో అని. ఇక ఎన్టీఆర్ షో కి హాజరైన సమంత నవ్వుతూ ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలకు టకాటకా సమాధానాలు చెప్పింది. 9 వ ప్రశ్న దగ్గర, 12,50000 వేల ప్రశ్న దగ్గర సమంత లైఫ్ లైన్స్ ని వాడుకుంది. అయితే అందరికి వీడియో కాల్ ఫ్రెండ్ ఉంటే.. సమంతకి మాత్రం ఆ అవకాశం లేదు.
ఇక ఎన్టీఆర్ గేమ్ ఆడించడం కాదు.. సమంతానే ఎన్టీఆర్ ని భయపెట్టింది. అందంగా సమాధానాలు చెబుతూ ఎన్టీఆర్ ని టీజ్ చేస్తూ.. ఎన్టీఆర్ టీజ్ చేస్తుంటే.. అల్లరి చేసిన సమంత .. ఎవరు మీలో కోటీశ్వరులు షో నుండి 25 లక్షలు పట్టుకెళ్లింది. తాను గెలుచున్న ప్రైజ్ మనీ ని ప్రత్యూష ఫౌండేషన్ కోసం ఉపయోగిస్తున్నట్టు చెప్పిన సమంతకి మరో రెండు ప్రశ్నలు ఉండగానే.. ఈ రోజు టైం అవ్వడంతో.. సమంత 50 లక్షల ప్రశ్న, కోటి రూపాయల ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. ఆ విషయంలో ఎన్టీఆర్ తో సమంత పోట్లాట కూడా పెట్టుకుంది. మొత్తానికి ఎన్టీఆర్ - సమంత కలిసి ఈ రోజు దసరా స్పెషల్ ఎవరు మీలో కోటీశ్వరులు ఎపిసోడ్ ని రక్తి కట్టించారు.