ఈ వారం నామినేషన్స్ లో ఏకంగా పది మంది ఉన్నారు. గత వారం హమీద వెళ్ళిపోయాక హౌస్ లో నామినేషన్స్ హీట్ మాములుగా లేదు. అందులో భాగంగా హౌస్ లోని 14 మందిలో 10 మంది నామినేషన్స్ లోకి వెళ్లారు. విశ్వ, షణ్ముఖ్, రవి, ప్రియాంక, సిరి, జెస్సి, సన్నీ, శ్రీరామ చంద్ర, శ్వేతా, లోబో లు ఉన్నారు. అయితే నామినేట్ అయినా సభ్యుల్లో ఎప్పటిలాగే షణ్ముఖ్ టాప్ లీడ్ లో ఓటింగ్ లో మొదటి స్థానంలో ఉండగా.. తర్వాత స్థానాల్లో సన్నీ, శ్రీరామ చంద్ర ఉన్నారు. ఆ తర్వాత ఓటింగ్ పరంగా రవి, శ్వేతా, జెస్సి, విశ్వ, ప్రియాంక, లోబో లు ఉన్నారు. అయితే తాజాగా విశ్వ, లోబో, ప్రియాంక లు ఓటింగ్ శాతం బట్టి డేంజర్ జోన్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది.
గత వారంలోను విశ్వ డేంజర్ జోన్ ని తప్పించుకున్నాడు. కానీ ఈ వారం విశ్వ, లోబో, ప్రియాంక లలో ఎవరో ఒకరి హౌస్ ని వీడేలా కనిపిస్తుంది ఓటింగ్ వ్యవహారం. కానీ చివరి క్షణం లో ఏమైనా జరగొచ్చు.. ఎవరైనా బయటికి వెళ్లొచ్చు అనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. విశ్వ టాస్క్ ఆడడం కన్నా అరుపులతో గెంటేస్తుంటే.. లోబో బిగ్ బాస్ లో హైలెట్ అవడానికి ఏదేదో చేస్తున్నాడు. ఇక ప్రియాంక ఎమోషనల్ గా మారిపోయింది. మానస్ తో ట్రాక్ వెయ్యడానికి తెగ ట్రై చేస్తుంది. కానీ వర్కౌట్ అవ్వడం లేదు. మరి ఈ వారం ఈ ముగ్గురిలోనే ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది.