రేపు రిలీజ్ కాబోతున్న అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ పై అక్కినేని అఖిల్ కే కాదు.. అటు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కూడా భారీ ఆశలే పెట్టుకున్నాడు. అఖిల్ కెరీర్ స్టార్ట్ చేసాక.. వరసగా ప్లాప్స్ తో సతమతమవుతున్నాడు. ఇప్పుడు కూడా ప్లాప్ డైరెక్టర్ చేతిలో పడినా.. గ్లామర్ గర్ల్ పూజ హెగ్డే పై ఉన్న నమ్మకమే.. వాళ్ళకి బలాన్ని ఇస్తుంది. గ్లామర్ గర్ల్, పాన్ ఇండియా హీరోయిన్ పూజ హెగ్డే హీరోయిన్ గా అఖిల్ సరసన నటించింది. క్యూట్ రొమాంటిక్ కాకుండా ఎమోషనల్ గాను, కామెడీ గాను ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ ఫామిలీస్ కి కనెక్ట్ అయ్యేలా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించారని.. ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్, పోస్టర్స్ చూస్తే అర్ధమవుతుంది. మరి దసరా స్పెషల్ గా రాబోతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ అఖిల్ కి హిట్ ఇవ్వాల్సిందే.
మరోపక్క బొమ్మరిల్లు భాస్కర్ కూడా ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు. అయితే గీత ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ హాండ్స్ నుండి వస్తున్న సినిమా కాబట్టి అందరిలో సినిమాపై అంచనాలు ఉన్నాయి. అరవింద్ పర్యవేక్షణలో తెరకెక్కిన సినిమా కాబట్టి నాగ్ కూడా కూల్ గా వున్నాడు. లేదంటే చిన్న కొడుకు ఇప్పటికి కెరీర్ లో నిలబడలేదనే బాధ ఉంది. కానీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ రిలీజ్ అవుతుంటే.. నాగార్జున ఫేస్ లో ఎలాంటి టెంక్షన్ లేదు.. కూల్ గా ఫలితం కోసం వెయిటింగ్ అంటున్నారు. ఇక ఈ సినిమా గనక తేడా కొడితే బొమ్మరిల్లు భాస్కర్ మరి కొన్నేళ్లు అజ్ఞాతంలోకి వెళ్ళాలి.. అలాగే అఖిల్ మార్కెట్ కూడా పడిపోతుంది.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కి అఖిల్ అండ్ టీం భారీ ప్రమోషన్స్ చేసింది. ప్రస్తుతం సినిమాపై పాజిటివ్ బజ్ ఉంది.. ఒకవేళ సినిమాకి హిట్ టాక్ పడితే.. బ్లాక్ బస్టర్ అయినట్లే. లేదంటే కష్టం. సో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఇప్పుడు అఖిల్ - బొమ్మరిల్లు భాస్కర్ మెడ కత్తి వేలాడుతున్నట్టే అనిపిస్తుంది కదూ చూస్తుంటే..