Advertisementt

మంచి రోజులు వచ్చాయి ట్రైలర్ రివ్యూ

Thu 14th Oct 2021 10:26 AM
manchi rojulochaie movie,director maruthi,santosh sobhan,mehreen kaur,manchi rojulochaie trailer  మంచి రోజులు వచ్చాయి ట్రైలర్ రివ్యూ
Manchi Rojulu Ochaie Trailer review మంచి రోజులు వచ్చాయి ట్రైలర్ రివ్యూ
Advertisement
Ads by CJ

మారుతి డైరెక్షన్ లో సంతోష్ శోభన్, మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా తెరకెక్కిన కొత్త సినిమా మంచి రోజులు వచ్చాయి. మంచి రోజులు వచ్చాయి చిత్ర ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌, సోసోగా ఉన్నా, ఎక్కేసిందే పాటలకు  అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఆద్యంతం వినోదాల విందుగా ఈ ట్రైలర్ సాగింది. ముఖ్యంగా డైలాగులు చాలా అద్భుతంగా ఉన్నాయి. యువీ వాళ్లు రాధే శ్యామ్ తీసారని ఊరికే ఉన్నారా.. ఏక్ మినీ కథ తీయలేదు.. కంటెంట్ ఎక్కుడుంటే అక్కడికి వెళ్లిపోవడమే అంటూ సరదా సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. సంతోష్ శోభన్, మెహ్రీన్ మధ్య కెమిస్ట్రీ కూడా అద్భుతంగా ఉంది. అలాగే అజయ్ ఘోష్ కామెడీ ట్రైలర్‌లో ఆకట్టుకుంది. 

దీపావళి సందర్భంగా నవంబర్ 4న మంచి రోజులు వచ్చాయి సినిమా విడుదల కానుంది. మహానుభావుడు లాంటి సూపర్ హిట్ తర్వాత మారుతి కాంబినేషన్‌లో మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను వి సెల్యులాయిడ్ SKN నిర్మిస్తున్నారు. టాక్సీవాలా తర్వాత ఈయన నిర్మాణంలో వస్తున్న సినిమా ఇది. మారుతి, వి సెల్యులాయిడ్ SKN అంటే సూపర్ హిట్ కాంబినేషన్. ఈ కాంబోలో ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి సినిమా వస్తుంది. ఏక్ మినీ కథ లాంటి హిట్ సినిమాను నిర్మించిన యూవీ కాన్సెప్ట్స్‌తో మరోసారి జోడీ కట్టాడు సంతోష్ శోభన్. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. మిగిలిన వివరాలు దర్శక నిర్మాతలు త్వరలోనే తెలియజేయనున్నారు.

Manchi Rojulu Ochaie Trailer review:

Manchi Rojulochaie Trailer launch

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ